Sun Dec 14 2025 10:06:27 GMT+0000 (Coordinated Universal Time)
కువైట్ జైలులో కడప యువకుడు ఆత్మహత్య
కువైట్ లో కడప జిల్లా వాసి ఆత్మహత్యకు పాల్పడ్డారు.జైలులో వెంకటేష్ ఆత్మహత్యకు పాల్పడినట్లు అక్కడి అధికారులు ధృవీకరించారు.

కువైట్ లో కడప జిల్లా వాసి ఆత్మహత్యకు పాల్పడ్డారు. కువైట్ సెంట్రల్ జైలులో ఉనన వెంకటేష్ ఆత్మహత్యకు పాల్పడినట్లు అక్కడి అధికారులు ధృవీకరించారు. కడప జిల్లాకు చెందిన వెంకటేష్ కొన్నాళ్ల క్రితం కువైట్ కు వెళ్లారు. అయితే వెంకటేష్ ముగ్గురిని హత్య చేసిన కేసులో నిందితుడి గా ఉన్నారు. దీనిపై విచారించిన న్యాయస్థానం ఆయనకు కఠిన శిక్ష వేసే అవకాశముందని ప్రచారం జరిగింది. దీంతో కువైట్ జైలులో ఉన్న వెంకటేష్ ఆత్మహత్య కు పాల్పడ్డారు.
ముగ్గురిని హత్య చేసిన కేసులో....
కడప జిల్లా లకల్కిరెడ్డిపల్లికి చెందిన వెంకటేష్ కువైట్ లో తాన పనిచేస్తున్న యజమానిని, అతడి భార్య, కుమార్తెలను హత్చ చేశారు. డ్రైవర్ గా పనిచేస్తున్న వెంకటేష్ ఈ దారుణానికి ఒడిగట్టారు. దీంతో ఈ నెల 7వ తేదీన వెంకటేష్ ను కువైట్ పోలీసులు అరెస్ట్ చేసి జైలులో ఉంచారు. హత్య కేసులో తనకు ఉరిశిక్ష పడుతుందన్న భయంతో వెంకటేష్ ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలిసింది. వెంకటేష్ కు భార్య, ఇద్దరు కుమారులున్నారు.
Next Story

