Mon Dec 23 2024 17:08:06 GMT+0000 (Coordinated Universal Time)
ఏసీబీ కోర్టులో పోలీసులకు ఎదురుదెబ్బ
ఎమ్మెల్యేల ఎరకేసులో పోలీసులకు ఏసీబీ కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. పోలీసులు జారీ చేసిన మెమోను ఏసీబీ కోర్టు కొట్టివేసింది
ఎమ్మెల్యేల ఎరకేసులో పోలీసులకు ఏసీబీ కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. పోలీసులు జారీ చేసిన మెమోను ఏసీబీ కోర్టు కొట్టివేసింది. బీఎల్ సంతోష్, తుషార్, జగ్గుస్వామిలను నిందితులుగా చేరుస్తూ దాఖలు చేసిన మెమోను ఏసీబీ కోర్టు కొట్టివేసింది. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ఇది కీలక పరిణామంగానే చెప్పుకోవాలి.
ఎమ్మెల్యేల ఎర కేసులో...
హైకోర్టులో నిన్న బీఎల్ సంతోష్, జగ్గుస్వామిలను ఈ నెల 13వ తేదీ వరకూ అరెస్ట్ చేయకుండా ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. వారి అరెస్ట్ పై స్టే పొడిగించింది. తాజాగా నిందితుల జాబితాలో చేరుస్తూ పోలీసులు దాఖలు చేసిన మెమోను ఏసీబీ కోర్టు కొట్టివేసింది.
Next Story