Mon Dec 23 2024 06:41:13 GMT+0000 (Coordinated Universal Time)
Mumbai : ముంబయిలో దారుణ హత్య... బాణాసంచాపేల్చి.. ఆతర్వాత కాల్పులు జరిపి?
ముంబై నడిబొడ్డున సీనియర్ ఎన్సీపీ నేత హత్యకు గురి కావడం సంచలనం కలిగించింది
ముంబై నడిబొడ్డున సీనియర్ ఎన్సీపీ నేత హత్యకు గురి కావడం సంచలనం కలిగించింది. అజిత్ పవర్ వర్గానికి చెందిన మహారాష్ట్ర మాజీ మంత్రి బాబా సిద్దిఖీ హత్యకు గురయ్యారు. బాంద్రా ప్రాంతంలో శనివారం రాత్రి తొమ్మిది గంటల 20 నిమిషాలు నుంచి తొమ్మిది గంటల 30 నిమిషాల మధ్య గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరపడంతో ఆయనను వెంటనే ముంబయిలోని చికిత్స నిమిత్తం లీలావతి ఆసుపత్రికి తరలించారు. బుల్లెట్లు దాడిలో సిద్ధిఖీ మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
ప్రీప్లాన్డ్తో...
సిద్ధిఖీ సల్మాన్ ఖాన్ కు సన్నిహితులుగా ఉన్నారు. నిందితులు పక్కా ప్లాన్ తో ఈ హత్య చేశారు. ముందుగా టపాసులు పేల్చి గందరగోళం సృష్టించి, తర్వాత బాబా సిద్దిఖీపై కాల్పులు జరిపారు. ఆయన కడుపు, ఛాతీకి లోకి బుల్లెట్లు దిగాయి. మొత్తం ఆరు బుల్లెట్లు శరీరంలోకి వెళ్లాయి. ఈ ఘటనలో ముగ్గురు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దాడికి పాల్పడిన వారు హర్యానా,ఉత్తరప్రదేశ్ కు చెందిన వారిగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే చెప్పారు సిద్ధికి కుమారుడు ప్రస్తుతం మహారాష్ట్ర కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్నారు
Next Story