Sun Dec 14 2025 18:05:54 GMT+0000 (Coordinated Universal Time)
హైదరాబాద్ లో కాల్పులు.. బాలుడికి గాయాలు
హైదరాబాద్ లోని పాతబస్తీ మొఘల్పురలో కాల్పుల కలకలం రేగింది. ఈ కాల్పుల్లో ఒక బాలుడికి తీవ్ర గాయాలయ్యాయి.

హైదరాబాద్ లోని పాతబస్తీ మొఘల్పురలో కాల్పుల కలకలం రేగింది. ఈ కాల్పుల్లో ఒక బాలుడికి తీవ్ర గాయాలయ్యాయి. మొఘల్పురలోని సుల్తాన్ షాషిలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ కాల్పుల్లో గాయపడిన బాలుడి అఫ్సర్ ను వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
కుక్కలను చంపేందుకు...
కుక్కలను చంపడానికి అఫ్సర్ ఎయిర్ గన్ తో కాల్పులు జరిపాడని ప్రాధమిక విచారణలో తేలింది. అది గురి తప్పి బాలుడికి తాకిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. కాల్పులకు పాల్పడిన అఫ్సర్ పై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. అఫ్సర్ ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
Next Story

