Mon Apr 21 2025 21:28:38 GMT+0000 (Coordinated Universal Time)
Road Accident : కారు టైర్ పేలి.. ముగ్గురు మృతి
కారు టైర్ పంక్చర్ పేలడంతో జరిగిన ప్రమాదంలో ముగ్గురు మరణించిన ఘటన విశాఖపట్నం జిల్లాలో జరిగింది

కారు టైర్ పంక్చర్ పేలడంతో జరిగిన ప్రమాదంలో ముగ్గురు మరణించిన ఘటన విశాఖపట్నం జిల్లాలో జరిగింది. వెదుళ్లపాలెం జాతీయ రహదారిపై జరిగిన ఈ ప్రమాదంలో ముగ్గురు మరణించారు. కారులో ప్రయాణిస్తున్న నలుగురిలో ముగ్గురు మరణించారు. ఈ ప్రమాదం రెండు కుటుంబాల్లో విషాదం నింపింది. కారు టైర్ పేలి కంటైనర్ ను ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది.
కాకినాడ వెళుతుండగా...
పాయకరావుపేట నుంచి కాకినాడ వెళుతుండగా జరిగిన ఈ ప్రమాదంలో రెండు కుటుంబాలకు చెందిన ముగ్గురు మరణించారు. కారు టైరు పైలి డివైడర్ ను ఢీకొని ఆవలి వైపు వస్తున్న కంటైనర్ ను ఢీకొనింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న వెంకటలక్ష్మి, దాడి గగన్, సుంకర మధుకర్ మరణించారు. వికాస్ కు ప్రమాదానికి గురయ్యాడు.ఈ ప్రమాదం తెలుసుకున్న పోలీసులు వెంటనే మృతదేహాలను పోస్టుమార్టానికి తరలించారు. క్షతగాత్రుడిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు
Next Story