Fri Nov 22 2024 21:03:28 GMT+0000 (Coordinated Universal Time)
పోలీసుల ఓవరాక్షన్.. చిన్నారి మృతి
చలానా చెల్లించాలని కారును పోలీసులు అరగంటకు పైగా ఆపడంతో శిశువు మృతి చెందిన సంఘటన తెలంగాణలో జరిగింది.
పోలీసుల ఓవరాక్షన్ తో ఒక పసికందు మృతి చెందింది. చలానా చెల్లించాలని కారును పోలీసులు అరగంటకు పైగా ఆపడంతో శిశువు మృతి చెందిన సంఘటన తెలంగాణలో జరిగింది. జనగామ జిల్లాకు చెందిన ఓ చిన్నారి తీవ్ర అస్వస్థతకు గురయింది. స్థానిక ఆసుపత్రి వైద్యులు హైదరాబాద్ తీసుకెళ్లాలని సూచించడంతో పసికందును ఒక ప్రయివేటు కారులో హైదరాబాద్ నీలోఫర్ కు తీసుకువస్తున్నారు.
చలానా కట్టాలని....
యాదగిరిగుట్ట మండలం వంగపల్లి వద్ద తనిఖీల్లో భాగంగా కారుకు వెయ్యి రూపాయల చలానా ఉందని, అది చెల్లించాలని పోలీసులు కోరారు. డ్రైవర్ వద్ద అంత సొమ్ము లేకపోవడంతో పోలీసులను తల్లిదండ్రులు బతిమాలు కున్నారు. పసికందు ప్రాణాపాయంలో ఉందని విడిచి పెట్టాలని కోరారు. అయినా వినకుండా అరగంట పాటు కారును నిలిపివేశారు. వెయ్యి రూపాయల చలానా పెండింగ్ ఉందని, అవి చెల్లించేంత వరకూ కారును కదలనివ్వబోనివ్వమని యాదగిరి గుట్ట ట్రాఫిక్ పోలీసులు తెగేసి చెప్పారు. బతిమాలుకుని ఆసుపత్రికి చేరుకున్న క్షణాల్లోనే పసికందు మరణించింది. పోలీసుల వల్లనే తమ చిన్నారి మృతి చెందిందని కుటుంబ సభ్యులు తెలిపారు. అయితే ట్రాఫిక్ పోలీసులు మాత్రం దీనిని ఖండిస్తున్నారు. తమకు వైద్యం కోసం వెళుతున్నట్లు వారు చెప్పలేదని చేతులు దులుపేసుకుంటున్నారు.
Next Story