Mon Dec 23 2024 04:00:33 GMT+0000 (Coordinated Universal Time)
Murder : నిజామాబాద్ జిల్లాలో ఒకే కుటుంబంలో ఆరుగురి హత్య.. సైకో కిల్లర్ తెగింపు
నిజామాబాద్ జిల్లాలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురిని హత్య చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
నిజామాబాద్ జిల్లాలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురిని హత్య చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పదిహేను రోజుల వ్యవధిలోనే ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురిని ప్రశాంత్ అనే యువకుడు హత్యచేసినట్లు పోలీసులు గుర్తించారు. ఇంటి కోసం ఈ వరస హత్యలు చేసినట్లు నిందితుడు అంగీకరించినట్లు తెలిసింది. ఈ నెల 9వ తేదీ నుంచి ఈ హత్యలను ప్రశాంత్ చేసినట్లు పోలీసుల విచారణలో వెల్లడయింది. నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండలం మాట్లూరుకు చెందిన మాక్లూరు ప్రసాద్ అనే వ్యక్తిని అతడి స్నేహితుడు ప్రశాంత్ హత్య చేసినట్లు పోలీసులు చెప్పారు.
హత్యలు చేస్తూ...
డిచ్పల్లి వద్ద ఉన్న హైవే వద్ద పూడ్చి పెట్టాడు. తర్వాత ప్రసాద్ భార్యను చంపేసిన ప్రశాంత్ బాసర వద్ద గోదావరి నదిలో పడేశాడు. తర్వాత వారి ఇద్దరు పిల్లలను పోచంపాడ్ సోన్ బ్రిడ్జివద్ద కాలువలోకి తోసి హత్య చేశాడు. తర్వాత ప్రసాద్ ఇద్దరి చెల్లెల్లను వేర్వేరుగా హత్య చేసినట్లు నిర్థారణ అయింది. అయితే ఈ వరస హత్యల్లో ప్రశాంత్ కు మరో ముగ్గురు సహకరించనట్లు తెలిసింది. ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు హత్య కావడంతో ఆ గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Next Story