Sat Apr 05 2025 22:18:35 GMT+0000 (Coordinated Universal Time)
జాతీయ రహదారిపై దోపిడీ.. కారులో నిద్రిస్తున్న వారిని?
కారులో నిద్రిస్తున్న వారిపై దాడి చేసి దోపిడీ చేసిన ఘటన విజయవాడ - హైదరాబాద్ జాతీయ రహదారిపై జరిగింది

కారులో నిద్రిస్తున్న వారిపై దాడి చేసి దోపిడీ చేసిన ఘటన విజయవాడ - హైదరాబాద్ జాతీయ రహదారిపై జరిగింది. తూర్పు గోదావరి జిల్లాలోని అమలాపురం మండలం తోట్లపాలెం గ్రామానికి చెందిన పల్లెపు శృతి నిన్న బయలుదేరి హైదరాబాద్ కు వస్తున్న తరుణంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆదివారం తెల్లవారు జామున వద్ద చిట్యాల మండలం పెద్ద కాపర్తి వద్ద కారు ఆపి విశ్రాంతి తీసుకుంటుండగా దొంగలు ముసుగులు వేసుకుని వచ్చి దోపిడీ చేశారు.
ముసుగులు వేసుకుని...
కారు అద్దాలు లాక్ చేసుకుని పడుకున్నప్పటికీ, దొంగలు బండరాయితో కారు అద్దాలను పగలకొట్టారు. కారులో నిద్రిస్తున్న వారిని బయటకు లాగి శృతి మెడలో ఉన్న బంగారు గొలుసు, పంచాక్షరి చేతికి ఉన్న ఉంగరాన్ని దొంగిలించుకుపోయారు. తెల్లవారు జామున 3.45 గంటలు కావడంతో కాసేపు విశ్రాంతి తీసుకుని బయలుదేరామనుకుంటే దొంగలు దోచుకుని వెళ్లారని శృతి చెప్పారు. పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే జాతీయ రహదారిపై దోపిడీని సీరియస్ గా తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Next Story