Sun Dec 22 2024 19:33:16 GMT+0000 (Coordinated Universal Time)
దేవరకొండలో ఎస్ఐ టార్చర్ తో యువకుడి మృతి
దేవరకొండలో పోలీస్ స్టేషన్ లో ఉన్న నిందితుడు మరణించిన ఘటన నల్లగొండ జిల్లాలో జరిగింది
దేవరకొండ పోలీస్ స్టేషన్ లో ఉన్న నిందితుడు మరణించిన ఘటన నల్లగొండ జిల్లాలో జరిగింది. ఎస్ఐ విపరీతంగా కొట్టడం వల్లనే మృతి చెందాడని మృతుడి బంధువులు ఆరోపిస్తున్నారు. దీనిపై విచారణకు ఉన్నతాధికారులు ఆదేశించారు. పోలీసుల కథనం ప్రకారం నల్లగొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గం చింతపల్లి మండలం పాలెం తండాకు చెందిన ఇద్దరు అన్నదమ్ముల మధ్య తలెత్తిన భూ వివాదంలో ఎస్ఐ సతీష్ రెడ్డి తలదూర్చారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఎస్ఐ చితకబాదడం వల్లనే...
కాంగ్రెస్ ఎంపీటీసీ వసంత్ నాయక్ సూచన మేరకు సూర్య నాయక్ అనే యువకుడిని పోలీస్ స్టేషన్ లో ఎస్ఐ సతీష్ రెడ్డి చితకబాదారంటూ బంధువులు ఆరోపిస్తున్నారు. పోలీస్ స్టేషన్ లో అస్వస్థతకు గురైన నూర్య నాయక్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. అయితే దీనిపై బంధువులు ఎస్ఐ పై వెంటనే చర్యలు తీసుకోవాలని మృతుడు సూర్యానాయక్ బంధువులు డిమాండ్ చేస్తున్నారు. ఎస్ఐ సూర్యానాయక్ ను మాత్రం ఉన్నతాధికారులు విధుల నుంచి తప్పించారు.
Next Story