Mon Dec 23 2024 09:41:15 GMT+0000 (Coordinated Universal Time)
కాకినాడలో దారుణం... బాలికపై అత్యాచారం
కాకినాడలో దారుణం చోటు చేసుకుంది. ఒక స్కూల్ కరస్పాండెట్ బాలికను మభ్యపెట్ట కొంతకాలంగా అత్యాచారానికి పాల్పడుతున్నారు.
కాకినాడలో దారుణం చోటు చేసుకుంది. ఒక స్కూల్ కరస్పాండెట్ బాలికను మభ్యపెట్ట కొంతకాలంగా అత్యాచారానికి పాల్పడుతున్నారు. బాలిక గర్భవతి కావడం, తీవ్ర రక్త స్రావం కావడంతో కుటుంబ సభ్యులు కాకినాడు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గత కొంతకాలంగా కాకినాడలో ఉన్న హెల్పిండ్ హ్యాండ్ ఎయిడెడ్ పాఠశాల కరస్పాండెంట్ విజయకుమార్ 9వ తరగతి చదువుతున్న బాలికపై కొంతకాలంగా అత్యాచారానికి పాల్పడుతున్నారు.
హాస్టల్ లో ఉండటంతో....
బాలిక హాస్టల్ లో ఉండటంతో స్కూల్ కరెస్పాండెంట్ అవకాశంగా మలచుకున్నాడు. బాలికను భయపెట్టి అనేకసార్లు అత్యాచారానికి పాల్పడినట్లు కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. వేసవి సెలవుల్లో ఇంటికి వచ్చిన బాలిక అస్వస్థతకు గురి కావడం, తీవ్ర రక్త స్రావం కావడంతో అసలు విషయం బయటపడింది. దీనిపై కాకినాడ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Next Story