Sun Apr 13 2025 06:59:53 GMT+0000 (Coordinated Universal Time)
Viskaha : విశాఖలో దారుణం.. దాడిచేసిన నిందితుడి అరెస్ట్
విశాఖలో దారుణం జరిగింది. మధురవాడ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక ప్రేమికుడు దారుణంగా యువతి తల్లిని కత్తితో పొడిచి చంపాడు

విశాఖలో దారుణం జరిగింది. మధురవాడ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక ప్రేమికుడు దారుణంగా యువతి తల్లిని కత్తితో పొడిచి చంపాడు. యువతిపైనా, తల్లిపైనా దాడా చేయడంతో తల్లికి అక్కడే మరణించగా యువతికి తీవ్రంగా గాయాలయ్యాయి. యువతిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే ప్రేమోన్మది నవీన్ ను శ్రీకాకుళం బూర్జిలో పోలీసులు అదుపులోకి తీసకున్నారు.
తల్లి మృతి చెందడంతో...
దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించారు. ప్రేమోన్మాదిని కఠినంగా శిక్షించాలని, యువతికి అవసరమైన చికత్సను అందచేయాలని ఆదేశించారు. తల్లి మృతి చెందడంతో దీనికి సంబంధించిన ఆధారాలన్నీ సేకరించినట్లు పోలీసులు తెలిపారు. మధ్యాహ్నం 12.30 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరగగా వెంటనే పోలీసులు నిందితుడు నవీన్ ను అదుపులోకి తీసుకున్నారు. యువతి పరిస్థితి కూడా ఆందోళకరంగా ఉందని పోలీసులు తెలిపారు.
Next Story