Sat Dec 21 2024 13:19:52 GMT+0000 (Coordinated Universal Time)
నంద్యాలలో దారుణ హత్య
నంద్యాల లో దారుణం చోటు చేసుకుంది. పోలీస్ కానిస్టేబుల్ ను రౌడీ షీటర్లు వెంటాడి చంపిన ఘటన నంద్యాలలో జరిగింది
నంద్యాల లో దారుణం చోటు చేసుకుంది. పోలీస్ కానిస్టేబుల్ ను రౌడీ షీటర్లు వెంటాడి చంపిన ఘటన నంద్యాలలో జరిగింది. కానిస్టేబుల్ సురేంద్రను ఇద్దరు రౌడీ షీటర్లు వెంటపడి హత్య చేశారు. సీసీ ఫుటేజీ ద్వారా నిందితులు ఎవరో పోలీసులు గుర్తించారు. మద్యం దుకాణం వద్ద జరిగిన గొడవ ఈ హత్యకు దారి తీసినట్లు తెలిసింది. ఈ ఘర్షణలో నిందితులు బీరు సీసాలతో సురేంద్ర కుమార్ తలపై బలంగా కొట్టారు.
ఆటోలో ఎక్కించుకుని...
దీంతో సురేంద్రకుమార్ కు తీవ్రగాయాలయ్యారు. ఆరుగురు ఉండటంతో పరుగులు తీసిన సురేంద్రను పట్టుకుని ఆటోలోకి ఎక్కించారు. ఆటోలో నగర శివార్లకు తీసుకెల్లి సురేంద్రను చంపారు. హత్య చేసిన నిందితులు పరారయ్యారు. పోలీసులు వారి కోసం గాలిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Next Story