Fri Dec 20 2024 17:13:06 GMT+0000 (Coordinated Universal Time)
హత్య కేసులో పదేళ్లు పరారీ.. ఎట్టకేలకు పట్టుకున్న పోలీసులు
హత్య కేసు నిందితులు పదేళ్ల తర్వాత దొరికిన సంఘటన రాజస్థాన్ లో జరిగింది.
హత్య కేసు నిందితులు పదేళ్ల తర్వాత దొరికిన సంఘటన రాజస్థాన్ లో జరిగింది. ధోల్పూర్ కు చెందిన బీజేపీ మాజీ ఎమ్మెల్యే బావమరిది, మరొక వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. నరేష్ కుష్వాను 2012 డిసెంబరు 27న ధోల్ పూర్ జిల్లాలోని జిల్ కా పురా గ్రామంలో కొందరు కాల్చి చంపారు. ఈ కేసుకు సంబంధించి మాజీ ఎమ్మెల్యే బీఎల్ కుష్వాకు న్యాయస్థానం యావజ్జీవ జైలు శిక్ష విధించింది.
ఇద్దరు మాత్రం...
నరేస్ కుష్వా హత్య కేసుకు సంబంధించి ఆమె సోదరుడు థాన్ సింగ్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఐదుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. వీరిలో ముగ్గురు దొరకగా, ఇద్దరు మాత్రం తప్పించుకు తిరుగుతున్నారు. వారు ఇద్దరు పదేళ్లుగా పరారీలో ఉన్నారు. వారి కోసం పోలీసులు వెతుకుతూనే ఉన్నారు. పదేళ్ల తర్వాత వారి శ్రమ ఫలించింది. ఈ కేసును వదిలి పెట్టకుండా పోలీసులు వారిని వెతికిపట్టుకుని అరెస్ట్ చేశారు.
Next Story