Mon Dec 23 2024 12:17:05 GMT+0000 (Coordinated Universal Time)
ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్ హత్య !
ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్ ను కత్తితో పొడిచి దారుణంగా హతమార్చిన ఘటన బీహార్ లోని తూర్పు చంపారన్ జిల్లాలో జరిగింది.
ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్ ను కత్తితో పొడిచి దారుణంగా హతమార్చిన ఘటన బీహార్ లోని తూర్పు చంపారన్ జిల్లాలో జరిగింది. సంగ్రామ్పూర్ పీఎస్ పరిధిలో ఈ హత్య జరగగా.. బాధితుడిని ఆదిత్య తివారీ అలియాస్ అలోక్ తివారీగా గుర్తించారు. స్థానిక ఎస్పీ ఆశిష్ వెల్లడించిన వివరాల మేరకు.. సంగ్రామ్పూర్ పీఎస్ పరిధిలో జరిగిన ఈ హత్యలో.. ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్ తీవ్ర కత్తిపోట్లకు గురయ్యారు. ఘటనా ప్రాంతానికి చేరుకున్న పోలీసులు కేసు విచారణ మొదలుపెట్టారు.
ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్ మృతదేహాన్ని పోస్టుమార్టమ్ కు తరలించి.. పూర్తయిన అనంతరం అంత్యక్రియలు నిర్వహించారు. కాగా.. ఆదిత్య తివారీని నలుగురు వ్యక్తులు హత్య చేసినట్లు భావించిన పోలీసులు.. నలుగురు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని ఎస్పీ ఆశిష్ తెలిపారు. ఆదిత్య తివారీ 40 వింగ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో జూనియర్ వారంట్ ఆఫీసర్ గా అమృత్ సర్ లో విధులు నిర్వర్తిస్తున్నారు.
Next Story