Fri Dec 20 2024 18:09:45 GMT+0000 (Coordinated Universal Time)
న్యూయార్క్ లో మరణించిన భారతీయుడు.. ప్రమాదం ఎలా జరిగిందంటే?
న్యూయార్క్‌లోని హర్లెన్‌లో శుక్రవారం జరిగిన అగ్ని ప్రమాదంలో
న్యూయార్క్‌లోని హర్లెన్‌లో శుక్రవారం జరిగిన అగ్ని ప్రమాదంలో 27 ఏళ్ల భారతీయుడు ప్రాణాలు కోల్పోయాడు. న్యూయార్క్‌లోని భారత రాయబార కార్యాలయం ఆ వ్యక్తిని ఫాజిల్ ఖాన్‌గా గుర్తించింది. అధికారులు అతని స్నేహితులు, కుటుంబ సభ్యులతో టచ్‌లో ఉన్నారు. ఇ-బైక్‌లోని లిథియం-అయాన్ బ్యాటరీ హార్లెమ్ అపార్ట్మెంట్ భవనంలో మంటలకు కారణమైందని స్థానిక అగ్నిమాపక శాఖను ఉటంకిస్తూ డైలీ న్యూస్ తెలిపింది.
మంటల్లో చిక్కుకున్న ఫాజిల్ ఖాన్ ను ఆసుపత్రికి తీసుకుని వెళ్లారు. కొలంబియా జర్నలిజం స్కూల్ గ్రాడ్యుయేట్ అయిన ఖాన్ ను కాపాడాలని చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఈ సంఘటనలో మరో 17 మంది కూడా గాయపడ్డారని చెప్పారు. భవనం పై అంతస్తులో మంటలు చెలరేగాయి, ప్రజలు కిటికీల నుండి దూకడం ప్రారంభించారు. ఈ సంఘటన తరువాత, భవనాల శాఖ ఆ భవనాన్ని ఖాళీ చేయాలని ఉత్తర్వు జారీ చేసింది. రెడ్‌క్రాస్ సమీపంలోని పాఠశాలలో అపార్ట్మెంట్ వాసులకు నివాసాన్ని ఏర్పాటు చేశారు. ప్రమాదం జరిగిన సమయంలో మంటలు చాలా తీవ్రంగా ఉన్నాయని.. మెట్ల దారిలో కూడా మంటలు వ్యాపించాయని అగ్నిమాపక శాఖ చీఫ్ జాన్ హోడ్జెన్స్ మీడియాకు తెలిపారు.
Next Story