Sun Dec 22 2024 16:11:53 GMT+0000 (Coordinated Universal Time)
భార్య ఇంటికి వెళ్లడంతో జోయాను ఇంటికి రమ్మన్నాడు.. ఆమె ఎవరన్నది తెలిసి..!
ఇండోర్ పోలీసులకు ముక్కలు ముక్కలుగా చేసిన ఓ మృతదేహం మిస్టరీగా నిలిచింది.
ఇండోర్ పోలీసులకు ముక్కలు ముక్కలుగా చేసిన ఓ మృతదేహం మిస్టరీగా నిలిచింది. అత్యంత కిరాతకంగా ఆ హత్య జరిగిందని గుర్తించారు. ఎట్టకేలకు మిస్టరీని ఛేదించగా సంచలన విషయం బయట పడింది. ఇండోర్ పోలీసులు ముక్కలు ముక్కలుగా దొరికిన మృతదేహానికి సంబంధించిన హంతకుడిని గుర్తించడం ద్వారా హత్య కేసును ఛేదించారు. నూర్ మహ్మద్ అనే నిందితుడు బాధితురాలిని మొహ్సిన్ అలియాస్ జోయాను చంపేశాడు. సోషల్ మీడియాలో నూర్ మహ్మద్ ప్రేమించిన అమ్మాయి.. అమ్మాయి కాదని హిజ్రా అని తెలుసుకున్నాడు. అందుకే కోపంతో చంపి మృతదేహాన్ని ముక్కలుగా నరికాడు. నిందితుడి నివాసం నుంచి మృతదేహాన్ని గుర్తించిన ఇండోర్ పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు.
ఇండోర్ జోన్ 2, డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (డిసిపి) సంపత్ ఉపాధ్యాయ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, "మృతదేహాన్ని మొహ్సిన్ అలియాస్ జోయా గా గుర్తించారు, అతను ఆగస్టు 28 నుండి కనిపించకుండా పోయాడు" అని చెప్పారు. పోలీసులు సీసీటీవీ ఫుటేజీని పరిశీలించి నిందితులను విచారించారు. నిందితుడి భార్య పుట్టింటికి వెళ్లడంతో, ఆ సమయంలో ఆమె ట్రాన్స్జెండర్ జోయాతో సోషల్ మీడియాలో పరిచయం అయింది. ఆ తర్వాత జోయాను తన ఇంటికి రమ్మని ఆహ్వానించాడు నిందితుడు. జోయా ట్రాన్స్జెండర్ అని నూర్ మహ్మద్ తెలుసుకోగా.. ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. గొడవ పెద్దదై మహ్మద్ జోయాను గొంతు నులిమి చంపాడు. ఆ తర్వాత అతను జోయా మృతదేహాన్ని రెండు ముక్కలుగా నరికి, ఒక భాగాన్ని గోనె సంచిలో నింపి బైపాస్కు దగ్గరగా ఉన్న పొదల్లోకి విసిరాడు. మిగిలిన భాగాన్ని తన ఇంట్లో ఒక పెట్టెలో దాచిపెట్టాడని పోలీసులు తెలిపారు.
Next Story