Mon Dec 23 2024 14:56:56 GMT+0000 (Coordinated Universal Time)
అమానుషం.. లిఫ్ట్ ఇచ్చి మహిళపై అత్యాచారం
నతో పాటు బైక్ పై మరో యువకుడు కూడా ఉన్నాడు. తాము గ్రామానికే వెళ్తున్నామని, బైక్ పై తీసుకెళ్తామని..
రాష్ట్రవ్యాప్తంగా ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరుగుతున్న వేళ.. కామారెడ్డి జిల్లాలో అమానుష ఘటన వెలుగుచూసింది. లిఫ్ట్ ఇస్తామంటూ మహిళను నమ్మించి తనతో తీసుకెళ్లిన యువకుడు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అంతటితో ఆగకుండా తన స్నేహితులతో కలిసి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత మహిళను అక్కడే వదిలేసి పరారయ్యారు. ఈ ఘటనపై బాధిత మహిళ పోలీసులకు ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసి నిందితుల కోసం వెతుకుతున్నారు.
వివరాల్లోకి వెళ్తే.. జుక్మల్ వెళ్లేందుకు ఖండే బల్లూరులో ఓ మహిళ బస్సు కోసం ఎదురుచూస్తుంది. ఆ మహిళ గ్రామానికే చెందిన యువకుడు బైక్ పై గ్రామానికి వెళ్తూ.. మహిళను చూసి ఆగాడు. తనతో పాటు బైక్ పై మరో యువకుడు కూడా ఉన్నాడు. తాము గ్రామానికే వెళ్తున్నామని, బైక్ పై తీసుకెళ్తామని నమ్మించారు. తెలిసిన యువకుడే కావడంతో వాళ్లను నమ్మి బైక్ ఎక్కింది. గ్రామానికి వెళ్లే దారిలో నిర్జన ప్రదేశంలో బైక్ ఆపి మహిళపై ఇద్దరూ అత్యాచారానికి పాల్పడ్డారు. అక్కడే మహిళను వదిలేసి పరారయ్యారు. కాసేపటికి తేరుకున్న బాధితురాలు స్థానికుల సహాయంతో ఇంటికి చేరింది. జరిగిన విషయాన్ని ఇంట్లో వాళ్లకు చెప్పి.. పోలీసులకు ఫిర్యాదు చేసింది. మహిళ ఫిర్యాదుపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితులను త్వరలోనే పట్టుకుని కోర్టులో హాజరు పరుస్తామని తెలిపారు.
Next Story