Sun Dec 22 2024 07:58:52 GMT+0000 (Coordinated Universal Time)
Anamika Bishnoi:భార్య ఇన్స్టాగ్రామ్ సెలెబ్రిటీ.. భర్త ఎందుకు చంపేశాడంటే?
ప్రముఖ ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లూయెన్సర్ అనామికా బిష్ణోయి ఆమె భర్త తుపాకితో
Anamika Bishnoi:ప్రముఖ ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లూయెన్సర్ అనామికా బిష్ణోయిని ఆమె భర్త తుపాకితో కాల్చి చంపాడు. రాజస్థాన్‌లోని ఫలోడీలో జరిగిందీ ఘటన. గదిలో కూర్చున్న భార్యను అతి సమీపం నుంచి తుపాకితో కాల్చడం అక్కడి సీసీటీవీ కెమెరాలో రికార్డయింది. భర్త చేతిలో హతమవడానికి ముందు ఆమె తన ఫాలోవర్లతో ఇన్‌స్టా లైవ్‌లో మాట్లాడింది. ఆమె చివరి వీడియో అదే. సోషల్ మీడియాలో లక్షకు పైగా ఫాలోవర్లు కలిగిన అనామికా కొంతకాలంగా భర్త నుంచి వేరుగా ఉంటోంది. ఆమె భర్త మహీరామ్ ఒక రౌండ్ కాల్చిన తర్వాత తుపాకి జామ్ కావడం వీడియోలో కనిపిస్తోంది. దీంతో తుపాకిని రీలోడ్ చేసి మరోసారి కాల్చాలని చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. హత్య ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. అప్పటికే నిందితుడు పరారయ్యాడు.
33 ఏళ్ల ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్.. తన సోషల్ మీడియా హ్యాండిల్లో 1 లక్ష కంటే ఎక్కువ మంది ఫాలోవర్స్ ను కలిగి ఉంది. ఆమె డ్యాన్స్ చేయడం, ప్రయాణం చేయడం, తన రోజువారీ జీవితానికి సంబంధిత రీల్స్‌ను చేస్తూ ఉంటుంది. బాధితురాలికి ఒక కుమారుడు ఉన్నాడు. బిష్ణోయ్ ఫలోడి నాగ్‌పూర్ రోడ్‌కు సమీపంలో ఉన్న నారీ కలెక్షన్ సెంటర్లో ఉంటుండేది. మహిళ తన భర్త నుండి చాలా సంవత్సరాలుగా విడిగా నివసిస్తూ ఉంది. నిందితుడైన భర్త మహిరామ్ బిష్ణోయ్‌ను పోలీసులు 30 గంటలపాటు వెతికి పట్టుకున్నట్లు సమాచారం. ఈ ఘటనకు సంబంధించి అతడిని అరెస్టు చేసినట్లు సమాచారం.
Next Story