Mon Dec 23 2024 13:43:41 GMT+0000 (Coordinated Universal Time)
దారుణం.. కూల్ డ్రింక్ మత్తుమందు కలిపి.. ఆపై వివస్త్రను చేసి
మీరావలికి ఆమెతో ఇదివరకే పరిచయం ఉండటంతో మాటలు కలిపాడు. కూల్ డ్రింక్ తాగుదామని తీసుకెళ్లి..
పెద్దదోర్నాల : స్నేహితురాలి పుట్టినరోజుకు వచ్చిన విద్యార్థినిపై దారుణానికి ఒడిగట్టాడు తోటి విద్యార్థి. మత్తుమందు కలిపిన కూల్ డ్రింక్ తాగించి.. ఆపై ఆమెను వివస్త్రను చేసి ఫొటోలు, వీడియోలు తీశాడు. ఈ ఘటన ప్రకాశం జిల్లా పెద్దదోర్నాల మండలంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని ఓ గ్రామానికి చెందిన దూదేకుల నాగూర్ మీరావలి(19) డిప్లమో చదువుతున్నాడు. మరో గ్రామానికి చెందిన ఇంటర్ విద్యార్థిని తన స్నేహితురాలి బర్త్ డే కోసం మార్కాపురంకు వచ్చింది.
మీరావలికి ఆమెతో ఇదివరకే పరిచయం ఉండటంతో మాటలు కలిపాడు. కూల్ డ్రింక్ తాగుదామని తీసుకెళ్లి.. మత్తుమందు కలిపి కూల్ డ్రింక్ ను ఆమెకు ఇచ్చాడు. కూల్ డ్రింగ్ తాగిన విద్యార్థిని స్పృహ కోల్పోయింది. అదే అదనుగా భావించిన మీరావలి.. ఆమెను వివస్త్రను చేసి తన మొబైల్లో వీడియో, ఫొటోలు తీశాడు. వాటిని చూసిన మీరావలి స్నేహితుడు రసూల్ (22) వాటిని సోషల్ మీడియాలో షేర్ చేశాడు. అవి వైరల్ అయి బాధిత విద్యార్థిని తల్లిదండ్రుల దృష్టికి చేరాయి. దాంతో బాధిత విద్యార్థిని తల్లిదండ్రులు పెద్దదోర్నాల పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని మీరావలి, రసూల్ లను అరెస్ట్ చేశారు.
Next Story