Fri Dec 20 2024 11:16:40 GMT+0000 (Coordinated Universal Time)
శిల్పా చౌదరి లీలలు అన్నీ ఇన్నీ కావయా?
సంపన్నుల నుంచి కోట్లు వసూలు చేసిన శిల్పా శ్రీనివాస్ కేసులో ఆసక్తికరమైన విషయాలు వెలుగు చూస్తున్నాయి.
సంపన్నుల నుంచి కోట్లు వసూలు చేసిన శిల్పా శ్రీనివాస్ కేసులో ఆసక్తికరమైన విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఇప్పటివరకూ అందిన ఫిర్యాదుల ప్రకారం శిల్పా చౌదరి దాదాపు 90 కోట్ల రూపాయలు వసూలు చేసినట్లు బయటపడింది. ఇప్పటివరకూ శిల్పా చౌదరిపై ఎనిమిది కేసులు నమోదయ్యాయి. ఇంకా శిల్పా బాధితులు పోలీస్ స్టేషన్ కు వచ్చి ఫిర్యాదు చేస్తున్నారు.
రోటీ మేకర్.....
శిల్పా చౌదరి టాలివుడ్ ప్రముఖులతో పాటు పారిశ్రామికవేత్తలు, ఫైనాన్షియర్ల భార్యలను టార్గెట్ చేసుకున్నారు. వారితో కిట్టీ పార్టీలు నిర్వహించి రియల్ ఎస్టేట్ వ్యాపారంలో పెట్టుబడులను సేకరించారు. బ్లాక్ మనీని వైట్ గా మారుస్తానంటూ కోట్లు తీసుకున్నారు. ఇక శిల్పా చౌదరి మరో వ్యాపారం కూడా బయటపడింది. రోటీ మేకర్ పేరిట మోసం చేశారని తెలుస్తోంది. జర్మనీ నుంచి రోటీ మేకర్స్ తెప్పిస్తానని చెప్పి ఆన్ లైన్ లో రెండువేలకు కొనుగోలు చేసి పాతిక వేలకు విక్రయించేది. తాజాగా ప్రియ అనే మహిళ వద్ద నుంచి అధిక వడ్డీతో రెండున్నర కోట్లు తీసుకున్నట్లు ఫిర్యాదు అందింది.
Next Story