Mon Dec 23 2024 16:56:07 GMT+0000 (Coordinated Universal Time)
కాలేజీ బిల్డింగ్ పై నుంచి దూకి ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య
ఇంతలోనే ఏమైందో గాని సోమవారం రాత్రి 10 గంటల సమయంలో ఆత్మహత్యకు పాల్పడింది. తోటి విద్యార్థులు..
కాలేజీ బిల్డింగ్ లోని నాల్గవ అంతస్తు నుంచి దూకి ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. హైదరాబాద్ లో జరిగిన ఈ ఘటన కలకలం రేపింది. ఆ విద్యార్థినిని ఆస్పత్రికి తరలించేలోపే ఆమె కన్నుమూసిందని పోలీసులు వెల్లడించారు. హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రగతినగర్ లో ఉన్న ఎక్సెల్ కాలేజీలో సోమవారం (ఏప్రిల్3) రాత్రి ఈ దారుణ ఘటన చేసుకుంది. మృతురాలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన ప్రియాంకగా గుర్తించారు.
ప్రియాంక నీట్ కోచింగ్ కోసం ఎక్సెల్ కాలేజీలో చేరింది. హాస్టల్ లో ఉంటూ క్లాసులకు హాజరైంది. ఇంతలోనే ఏమైందో గాని సోమవారం రాత్రి 10 గంటల సమయంలో ఆత్మహత్యకు పాల్పడింది. తోటి విద్యార్థులు సమాచారమివ్వగా.. అక్కడికి చేరుకున్న పోలీసులు.. తీవ్రగాయాలతో ఉన్న ప్రియాంకను హుటాహుటిన ఆస్పత్రికి తీసుకెళ్లారు. కానీ అప్పటికే ప్రియాంక చనిపోయిందని వైద్యులు ధృవీకరించడంతో.. పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. అయితే మృతురాలు ప్రియాంకకు తమ కాలేజీకి ఎలాంటి సంబంధం లేదని ఎక్సెల్ కాలేజీ యాజమాన్యం పేర్కొంది. చౌటుప్పల్ సమీపంలో ఉన్న దావో మెడికల్ అకాడెమీలో విద్య ప్రియాంక కోచింగ్ తీసుకుంటోందని, తాము కేవలం ఆకామిడేషన్ ఇచ్చినట్లు పేర్కొంది.
Next Story