Tue Apr 15 2025 14:14:01 GMT+0000 (Coordinated Universal Time)
నారాయణ క్యాంపస్ లో విద్యార్థిని ఆత్మహత్య?
వివరాల్లోకి వెళ్తే.. బాచుపల్లిలో ఉన్న నారాయణ కాలేజీలో వంశిత ఇంటర్ చదువుతోంది. క్యాంపస్ హాస్టల్ లోనే ఉంటోంది.

హాస్టల్ భవనం పై నుండి దూకి ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాద ఘటన బాచుపల్లిలోని నారాయణ క్యాంపస్ లో జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. బాచుపల్లిలో ఉన్న నారాయణ కాలేజీలో వంశిత ఇంటర్ చదువుతోంది. క్యాంపస్ హాస్టల్ లోనే ఉంటోంది. మంగళవారం ఉదయం హాస్టల్ భవనంలోని ఐదవ అంతస్తు నుండి కిందపడి వంశిత మరణించింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా ప్రాంతానికి వెళ్లి మృతదేహాన్ని పోస్టుమార్టంకు పంపారు.
కామారెడ్డికి చెందికి ఆర్ వంశిక (16)ను వారంరోజుల క్రితమే తల్లిదండ్రులు హాస్టల్ లో చేర్పించారు. ఇంతలోనే వంశిక భవనం పై నుండి పడి చనిపోయింది. వంశికది ఆత్మహత్యేనా ? లేక ప్రమాదవశాత్తు పడిందా ? అనే కోణంలో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Next Story