హైదరాబాద్ లో ఇంటర్నెట్ ఫార్మసీ గుట్టు రట్టు
ఆశీష్ జైన్ అనే వ్యక్తి ఇంట్లో ఎన్సీబీ సోదాలు నిర్వహించింది. రూ.3.71 కోట్ల నగదును ఎన్సీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఫార్మసీ
హైదరాబాద్ నగరంలో అంతర్జాతీయ డ్రగ్స్ పెడ్లర్‌ను, ఇంటర్నెట్ ఫార్మసీ గుట్టును నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో అధికారులు రట్టు చేశారు. ఆశీష్ జైన్ అనే వ్యక్తి ఇంట్లో ఎన్సీబీ సోదాలు నిర్వహించింది. రూ.3.71 కోట్ల నగదును ఎన్సీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఫార్మసీ ముసుగులో ఆశీష్ జైన్ డ్రగ్స్ దందా చేస్తున్నట్లు గుర్తించారు. ఇంటర్నెట్ ఫార్మసీ, జేఆర్ ఇన్ఫినిటీ పేరుతో వ్యాపారం సాగిస్తున్నారు. ఆశీష్ అమెరికాకు డ్రగ్స్ సరఫరా చేస్తున్నారు. గత రెండేళ్లలో వెయ్యికి పైగా డ్రగ్స్ ఆర్డర్లను పంపినట్లు సమాచారం. ఆశీష్ నుంచి కీలక సమాచారం ఎన్సీబీ సేకరించింది. బిట్‌కాయిన్స్, క్రిప్టో కరెన్సీ ద్వారా లావాదేవీలు జరిపినట్లు నిర్ధారించింది. అమెరికా మాత్రమే కాకుండా ఇతర దేశాలకు డ్రగ్స్ ను రవాణా చేసే అక్రమ ఇంటర్నెట్ ఫార్మసీని హైదరాబాద్ కేంద్రంగా నడిపిస్తున్నారని ఎన్‌సిబి ఆదివారం తెలిపింది. JR ఇన్ఫినిటీ ప్రైవేట్ లిమిటెడ్, తెలంగాణ రాజధాని నగరంలోని దోమల్‌గూడలో ఉంది.