Fri Nov 22 2024 22:38:07 GMT+0000 (Coordinated Universal Time)
12 కోట్ల స్కామ్.. దర్యాప్తు వేగవంతం
మహేష్ బ్యాంకు కుంభకోణంలో దర్యాప్తు వేగమంతమయింది. 12 కోట్లను సైబర్ నేరగాళ్లు బ్యాంకు నుంచి వివిధ ఖాతాల్లోకి మళ్లించారు
మహేష్ బ్యాంకు కుంభకోణంలో దర్యాప్తు వేగమంతమయింది. దాదాపు పన్నెండు కోట్లను సైబర్ నేరగాళ్లు బ్యాంకు నుంచి వివిధ ఖాతాల్లోకి మళ్లించారు. దీనిపై పది ప్రత్యేక దర్యాప్తు బృందాలను ఏర్పాటు చేశారు. మహేష్ బ్యాంకులోని మూడు కరెంట్ అకౌంట్ల నుంచి పన్నెండు కోట్లను కొల్లగొట్టినట్లు పోలీసులు గుర్తించారు.
మూడు పేర్లతో .....
శాన్విక్ ఎంటర్ ప్రైజెస్, హిందూస్థాన్ ట్రేడర్స్, షాన్ వాజ్ బేగం పేర్లతో సిద్దిఅంబర్ బజార్, హుస్సేని ఆలం, అత్తాపూర్ లో కరెంట్ అకౌంట్లు ఓపెన్ చేశారు. ముంబయికి చెందిన ఒక మహిళతో ఈ బ్యాంకు ఖాతాలను తెరిచారు. ఇందుకోసం హుస్సేని ఆలంలోని ఒక వ్యాపారవేత్తను ఉపయోగించుకున్నారని పోలీసుల దర్యాప్తులో తేలింది. అయితే ఈ ముగ్గురు ఖాతాదారులు పోలీసులకు అందుబాటులో లేకుండా పోయారు. మహేష్ బ్యాంకు అకౌంట్ నుంచి అమెరికా, కెనడాల నుంచి హ్యాక్ చేశారని కనుగొన్నారు. ప్రాక్సీ అకౌంట్ల ద్వారా హ్యాకింగ్ కు పాల్పడిన వారిని గుర్తించే పనిలో ఉన్నారు. 20 బ్యాంకుల్లోని 127 అకౌంట్లను సీజ్ చేయాలని సంబంధిత బ్యాంకులకు లేఖలు రాశారు.
- Tags
- mahesh bank
- scam
Next Story