Thu Apr 10 2025 22:12:06 GMT+0000 (Coordinated Universal Time)
భాగ్యనగరంలో ఐసిస్ సానుభూతిపరుడు అరెస్ట్
సులేమాన్ సోషల్ మీడియాలో పెట్టిన పోస్టుల ఐపీ అడ్రస్ ద్వారా అతడి నివాసాన్ని గుర్తించారు. పాతబస్తీలో సులేమాన్..

హైదరాబాద్ : ఐసిస్ సానుభూతిపరుడు సులేమాన్ ను హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఫలక్ నుమాకు చెందిన సులేమాన్.. అమెరికాకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టాడు. హైదరాబాద్ నుంచి అమెరికాకు వెళ్లి యుద్ధం చేయాలని.. ఐసిస్ తరపున ప్రచారం చేస్తుండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు.
సులేమాన్ సోషల్ మీడియాలో పెట్టిన పోస్టుల ఐపీ అడ్రస్ ద్వారా అతడి నివాసాన్ని గుర్తించారు. పాతబస్తీలో సులేమాన్ ఉన్నట్లు తెలుసుకున్న పోలీసులు.. అతడిని అరెస్ట్ చేశారు. సులేమాన్ యువతను తీవ్రవాదం వైపు ఆకర్షించేలా ప్రచారం చేస్తుండటంతో అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు.
Next Story