Mon Dec 23 2024 18:39:05 GMT+0000 (Coordinated Universal Time)
గ్యాంగ్‌రేప్ కేసులో ఇద్దరి అరెస్ట్?
హైదరాబాద్ గ్యాంగ్ రేప్ కేసులో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది.
హైదరాబాద్ గ్యాంగ్ రేప్ కేసులో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. నగర శివార్లలో వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారని సమాచారం. ఇందులో ఎమ్మెల్యే, వక్ఫ్ బోర్డు కుమారులుగా తెలుస్తోంది. ఎంఐఎంకు చెందిన బహుదూర్‌పురా ఎమ్మెల్యే కుమారుడు రహేల్ ను, వక్ఫ్ బోర్డు ఛైర్మన్ కుమారుడు ఆహుల్లాఖాన్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
విపక్షాల వత్తిడితో....
అమ్నేషియా పబ్ లో ఒక బాలికను కొందరు బెంజికారులో తీసుకుని వెళ్లి గ్యాంగ్ రేప్ కు పాల్పడ్డారన్న ఆరోపణలున్నాయి. ఈ సంఘటన జరిగి మూడు రోజులవుతున్నా పోలీసులు కేసు నమోదు చేయలేదు. అయితే మీడియాలో ప్రధానంగా వార్తలు రావడం, విపక్షాలు ఆందోళనకు దిగడంతో పోలీసులు చర్యలు ప్రారంభించారు. ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. మంత్రి కేటీఆర్ సయితం బాధ్యులపై వెంటనే చర్యలు తీసుకోవాలని, ఎవరినీ వదల వద్దని కోరారు.
Next Story