Mon Dec 23 2024 11:25:59 GMT+0000 (Coordinated Universal Time)
Breaking : మోస్ట్ వాంటెడ్ ట్రెర్రరిస్ట్ మట్టూ దొరికిపోయాడు
హిజ్బుల్ ముజాహిదీన్ కు చెందిన మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ జావేద్ అహ్మద్ మట్టూను పోలీసు ప్రత్యేక విభాగం పట్టుకుంది
హిజ్బుల్ ముజాహిదీన్ కు చెందిన మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ జావేద్ అహ్మద్ మట్టూను పోలీసుల ప్రత్యేక విభాగం పట్టుకుంది. ఢిల్లీలో మట్టూ పట్టుబట్టాడు. అందిన సమాచారం మేరకు మట్టూ ఢిల్లీకి వచ్చాడని తెలుసుకున్న పోలీసులు జాగ్రత్తగా అతని వివరాలను సేకరించి చివరకు పట్టుకున్నారు. జమ్మూ కాశ్మీర్ కు చెందిన జావేద్ అహ్మద్ మట్టూ దేశంలో అనేక ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడినట్లు పోలీసు రికార్డులు చెబుతున్నాయి. అతని నుంచి ఒక పిస్టల్, మ్యాగ్జైన్లు స్వాధీనం చేసుకున్నారు.
పట్టించిన వారికి...
అతనిని పట్టించిన వారికి ఐదు లక్షల రూపాయల రివార్డును కూడా పోలీసులు ప్రకటించారు. మట్టూ అనేక సార్లు పాకిస్థాన్ కు వెళ్లి అక్కడ ఉగ్రవాద కార్యకలాపాల్లో శిక్షణ పొందినట్లు గుర్తించారు. మట్టూ సోపోర్ నివాసి. మట్టూ పోలీసులకు చిక్కడంతో మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ పట్టుబడినట్లయింది. అతనిని విచారించిన అనంతరం న్యాయస్థానం ఎదుట హాజరుపర్చనున్నారు. మట్టూ కోసం నేషనల్ ఇన్విస్టిగేషన్ ఏజెన్సీ అధికారులు కూడా గాలిస్తున్నారని పోలీసులు వెల్లడించారు.
Next Story