Mon Nov 18 2024 01:43:52 GMT+0000 (Coordinated Universal Time)
మొహర్రం వేడుకలు.. నలుగురు మృతి
గాయపడిన వారందరినీ వెంటనే బొకారో థర్మల్ డివిసి ఆసుపత్రికి చికిత్స కోసం తరలించారు.
శనివారం నాడు మొహరం పండుగ వేడుకలలో నిర్వహించే పీర్ల వేడుకలో ఊహించని విషాదం చోటు చేసుకుంది. జార్ఖండ్ రాష్ట్రంలో మొహరం పండగ వేళ నిర్వహించిన ఊరేగింపు కార్యక్రమంలో హై టెన్షన్ వైర్ తగిలి నలుగురు మృతిచెందగా, 13 మందికి తీవ్ర గాయాలయ్యాయి. జార్ఖండ్ రాష్ట్రం బొకారో జిల్లాలోనే ఖేత్కో అనే గ్రామంలో ఊరేగింపు కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. తాజీయా, మసీద్ లను ఊరేగింపు చేశారు. ఈ వేడుకలో భారీగా ముస్లింలు పాల్గొన్నారు. వారు ఊరేగిస్తున్న తాజీయా.. హైటెన్షన్ వైర్లకు తాకింది. దీంతో దానిని పట్టుకున్న వారికి కరెంట్ షాక్ తగిలింది. ఈ క్రమంలో నలుగురు మృతి చెందారు. 13 మందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.
గాయపడిన వారందరినీ వెంటనే బొకారో థర్మల్ డివిసి ఆసుపత్రికి చికిత్స కోసం తరలించారు. మృతుల్లో ఆసిఫ్ రజా, ఇనాముల్ రబ్, గులాం హుస్సేన్, సాజిద్ అన్సారీ ఉన్నారు. గాయపడిన వారిలో కొందరిని సలావుద్దీన్ అన్సారీ, ఇబ్రహీం అన్సారీ, లాల్ మహ్మద్ ఫిర్దౌస్ అన్సారీ, మెహతాబ్ అన్సారీ, ఆరిఫ్ అన్సారీ, షాబాజ్ అన్సారీ, మోజోబిల్ అన్సారీ, సాకిబ్ అన్సారీగా గుర్తించారు.
Next Story