Thu Dec 19 2024 19:07:36 GMT+0000 (Coordinated Universal Time)
సౌమ్య విశ్వనాథన్ ను చంపిన వారికి పడిన శిక్ష ఇదే!!
25 ఏళ్ల జర్నలిస్ట్ సౌమ్యా విశ్వనాథన్ ఢిల్లీలోని వసంత్ విహార్‌లో 2008 సెప్టెంబరు 30 వ
జర్నలిస్టు సౌమ్య విశ్వనాథన్ హత్య జరిగిన దాదాపు 15 ఏళ్ల తర్వాత నలుగురు దోషులకు ఢిల్లీలోని సాకేత్ కోర్టు శనివారం యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. ఐదో దోషికి ఇప్పటికే జైలు శిక్ష పడింది. నలుగురు నిందితులు రవికపూర్, అమిత్ శుక్లా, బల్బీర్ మాలిక్, అజయ్ కుమార్‌లకు మహారాష్ట్ర కంట్రోల్ ఆఫ్ ఆర్గనైజ్డ్ క్రైమ్ యాక్ట్ (MCOCA) కింద ఒక్కొక్కరికి రూ.25,000 అలాగే మరో లక్ష జరిమానా విధించారు. ఐదో దోషి అజయ్ సేథీకి రూ.7.5 లక్షల జరిమానా విధించింది. నలుగురు దోషులకు విధించిన జరిమానాలో రూ.1.2 లక్షలను సౌమ్య విశ్వనాథన్ తల్లిదండ్రులకు ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. అజయ్ సేథీ చెల్లించాల్సిన రూ.7.25 లక్షలలో రూ. 7.2 లక్షలు కుటుంబానికి విడుదల చేయాలని కోర్టు తెలిపింది. ఈ హత్య 'రేరెస్ట్ ఆఫ్ రేర్' కేటగిరీ కిందకు రాదని, అందువల్ల మరణశిక్ష విధించలేమని కోర్టు పేర్కొంది.
25 ఏళ్ల జర్నలిస్ట్ సౌమ్యా విశ్వనాథన్ ఢిల్లీలోని వసంత్ విహార్‌లో 2008 సెప్టెంబరు 30 వ తేదీన దారుణ హత్యకు గురయ్యారు. తుపాకితో కాల్చి అతి కిరాతకంగా హత్య చేసిన దుండుగులు.. మృతదేహాన్ని కారులో పడేసి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. తలపై తీవ్ర గాయాలతో జర్నలిస్ట్ చనిపోయినట్టు ఫోరెన్సిక్, పోస్ట్‌మార్టం నివేదికలో వెల్లడయ్యింది. ఈ కేసులో నిందితులుగా ఉన్న రవి కపూర్, అమిత్ శుక్లా, బల్జిత్ మాలిక్, అక్షయ్ కుమార్, అజయ్ సేథిలను దోషులుగా తేల్చింది. మహారాష్ట్ర కంట్రోల్ ఆఫ్ ఆర్గనైజ్డ్ క్రైమ్ చట్టంలోని నిబంధనల ప్రకారం దోపిడి కేసులోనూ దోషులుగా పేర్కొంది. నలుగురు నిందితులు రవి కపూర్, అమిత్ శుక్లా, బల్జిత్ మాలిక్, అక్షయ్లను హత్య, దోపిడీ కేసులో దోషులుగా నిర్దారించిన కోర్టు.. వీరికి సహకరించినందుకు ఐదో నిందితుడు అజయ్‌ను కూడా దోషిగా పరిగణించింది. ఈ కేసులో 2009 మార్చిలో నిందితులను పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. పదిహేనేళ్ల పాటు విచారణ సుదీర్ఘంగా సాగింది. ప్రాసిక్యూషన్ సాక్షులు హాజరుకాకపోవడం, ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ నియామకానికి సమయం పట్టడం వంటి కారణాల వల్ల కేసు ఇన్నేళ్లు సాగింది.
Next Story