ఎంఐఎం ఎమ్మెల్యే కుమారుడి అరెస్ట్.. మూడు రోజుల పోలీసు కస్టడీ..!
సాదుద్దీన్ మాలిక్(18), మరో నలుగురిని ఇప్పటికే అరెస్ట్ చేశారు. జూబ్లీహిల్స్ మైనర్ రేప్ కేసులో A1 నిందితుడైన సాదుద్దీన్ మాలిక్
జూబ్లీహిల్స్‌లో బాలికపై అఘాయిత్యం కేసులో ఎమ్మెల్యే కొడుకును పోలీసులు అరెస్ట్‌చేశారు. అతడిని ఆరో నిందితుడిగా చేర్చి పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. సాదుద్దీన్ మాలిక్(18), మరో నలుగురిని ఇప్పటికే అరెస్ట్ చేశారు. జూబ్లీహిల్స్ మైనర్ రేప్ కేసులో A1 నిందితుడైన సాదుద్దీన్ మాలిక్ మూడురోజుల కస్టడికి ఇచ్చింది కోర్టు. సాదుద్దీన్ కస్టడీ కోరుతూ నాంపల్లి కోర్టులో పోలీసులు పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. వారం రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని కోరారు. నేరం జరిగిన ప్రదేశంలో సీన్ రికన్స్ట్రక్న్ చేయాల్సి ఉందని.. ఘటనకు సంబంధించి మరింత సమాచారాన్ని సేకరించాలని ప్రాసిక్యూషన్ తన వాదనలో పేర్కొంది. ఇందుకోసం నిందితుడిని పోలీసు కస్టడీకి అప్పగించాలని తెలిపింది. ఈ క్రమంలోనే రేపటి నుంచి మూడు రోజుల పాటు సాదుద్దీన్‌ను పోలీసు కస్టడీకి అనుమతిస్తూ నాంపల్లి కోర్టు నిర్ణయం తీసుకుంది.