Mon Nov 25 2024 08:47:15 GMT+0000 (Coordinated Universal Time)
Junior doctor: జూనియర్ డాక్టర్ విధులకు వెళుతుండగా.. ఆసుపత్రి లిఫ్ట్‌లో
ఈ ఘటనతో వైద్యులు పెన్ డౌన్ సమ్మెను
జార్ఖండ్‌లోని రాంచీలోని రాజేంద్ర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (రిమ్స్)లో ఆంకాలజీ విభాగానికి చెందిన జూనియర్ రెసిడెంట్ డాక్టర్ విధులకు వెళుతుండగా ఆసుపత్రి లిఫ్ట్‌లో వేధింపులు ఎదురయ్యాయి. ఈ ఘటనపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి నిందితుడిని అరెస్టు చేశారు. ఈ ఘటనతో వైద్యులు పెన్ డౌన్ సమ్మెను ప్రకటించారు. జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ (జేడీఏ), రిమ్స్ యాజమాన్యం మధ్య చర్చల అనంతరం వైద్యులకు భద్రత పెంచుతామని యాజమాన్యం హామీ ఇవ్వడంతో సమ్మె విరమించారు. ప్రతి లిఫ్టుకు లిఫ్ట్ ఆపరేటర్లను నియమించాలని, ప్రతి వార్డులో సాయుధ పోలీసు అధికారులను నియమించాలని డిమాండ్ చేశారు.
ఆగస్టు 9న కోల్ కతా లోని RG కర్ హాస్పిటల్ లో మహిళా ట్రైనీ డాక్టర్‌పై అత్యాచారం, హత్య ఘటన జరిగిన తర్వాత దేశ వ్యాప్తంగా మహిళా వైద్యుల భద్రతపై ఆందోళన మొదలైంది. బాధితురాలికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ వైద్యులు వీధుల్లోకి రావడంతో దేశవ్యాప్తంగా భారీ నిరసనలకు దారితీసింది. ఇతర మహిళా వైద్యులకు ఎంత మాత్రం రక్షణ ఇస్తున్నారనే విషయంపై కూడా చర్చ జరుగుతూ ఉంది. రిమ్స్‌లోని జూనియర్ డాక్టర్లు కూడా మెరుగైన భద్రత అందించాలని, మెడికల్ ప్రొటెక్షన్ యాక్ట్‌ను అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
Next Story