Mon Dec 23 2024 10:24:09 GMT+0000 (Coordinated Universal Time)
మచిలీపట్నంలో జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అరెస్ట్
మే 20వ తేదీన ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా సింహాద్రి సినిమా రీ రిలీజ్ చేసిన విషయం తెలిసింది. సినిమా రీ-రిలీజ్..
ఆర్ఆర్ఆర్ సినిమాతో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ గ్లోబల్ వైడ్ గా పెరిగింది. ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ఆయనకు ఫ్యాన్స్ ఉన్నారు. మే 20వ తేదీన ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా సింహాద్రి సినిమా రీ రిలీజ్ చేసిన విషయం తెలిసింది. సినిమా రీ-రిలీజ్ సమయంలో కృష్ణజిల్లా మచిలీపట్నంలోని సిరికృష్ణ - సిరివెంకట్ అనే రెండు థియేటర్ల వద్ద అభిమానులు అత్యుత్సాహం ప్రదర్శించారు. ఫలితంగా జైలుపాలయ్యారు. థియేటర్ల వద్ద ఏర్పాటు చేసిన ఫెక్సీల ముందు రెండు మేకలను వేట కొడవళ్లతో నరికి వాటి రక్తాన్ని ఫ్లెక్సీపై చిందించారు.
వాటిని వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో.. అవి వైరల్ అయ్యాయి. ఇవి పోలీసుల దృష్టికి చేరడంతో.. 9 మందిని అరెస్ట్ చేశారు. మారణాయుధాలు ఉపయోగించి ప్రజలను భయభ్రాంతులకు గురిచేశారని కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు. ఇదిలా ఉండగా.. సింహాద్రి రీ-రిలీజ్ రోజున తెలుగు రాష్ట్రాల్లో అభిమానులే.. విదేశాల్లోని అభిమానులు రచ్చరచ్చ చేశారు. యూకేలోని వెస్ట్ లండన్లో ఓ థియేటర్లో సింహాద్రి సినిమా ప్రదర్శితం అవుతుండగా క్రాకర్స్ పేల్చారు. దీంతో అవి కాస్తా తెరపై పడి.. దానికి మంటలు అంటుకున్నాయి. ప్రేక్షకులు భయాంతోళనతో బయటకు పరుగులు తీశారు.
Next Story