Thu Dec 19 2024 01:14:44 GMT+0000 (Coordinated Universal Time)
వంతెన వద్ద వ్యాపారవేత్త BMW కారు దొరికింది.. కానీ!
ఓ వ్యాపారి అదృశ్యమయ్యారు. అయితే ఆయన కారు ధ్వంసమైన స్థితిలో
కర్ణాటకలో ఓ వ్యాపారి అదృశ్యమయ్యారు. అయితే ఆయన కారు ధ్వంసమైన స్థితిలో మంగళూరులోని బ్రిడ్జి సమీపంలో దొరికిందని పోలీసులు తెలిపారు. వ్యాపారవేత్త, జనతాదళ్ (సెక్యులర్) MLC BM.ఫరూక్, కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే మొహియుద్దీన్ బావా సోదరుడు ముంతాజ్ అలీ ఆదివారం ఉదయం అదృశ్యమయ్యాడు, దీంతో పోలీసులు సెర్చ్ ఆపరేషన్ను ప్రారంభించారు.
ప్రాథమిక విచారణ ప్రకారం, తెల్లవారుజామున 3 గంటలకు, అతను తన కారులో తన ఇంటి నుండి బయలుదేరాడు. నగరం చుట్టూ తిరిగాడు. తెల్లవారుజామున 5 గంటల ప్రాంతంలో మంగళూరులోని కులూరు వంతెన దగ్గర కారు ఆపాడని పోలీసులు తెలిపారు. అతని కుమార్తె స్థానిక పోలీసులకు సమాచారం అందించిందని మంగళూరు పోలీస్ కమిషనర్ అనుపమ్ అగర్వాల్ తెలిపారు.
NDRF, SDRF రెస్క్యూ బృందాలు కులూర్ నదిలో వెతకడానికి మోహరించారు. అక్కడే మిస్టర్ అలీ మిస్ అయినట్లు భావిస్తున్నారు. ఆయన కారు బ్రిడ్జి సమీపంలో ప్రమాదానికి గురై ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. పోలీసులు సంఘటనపై క్షుణ్ణంగా దర్యాప్తు చేస్తున్నారు. ఈ దశలో అదృశ్యానికి ఖచ్చితమైన కారణం అస్పష్టంగా ఉన్నప్పటికీ, అలీ వంతెనపై నుండి దూకి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.

Next Story