Mon Dec 23 2024 00:39:20 GMT+0000 (Coordinated Universal Time)
ఆ డాక్టర్, ల్యాబ్ టెక్నీషియన్ మూడేళ్ళలో చేసిన దారుణాలు ఎలాంటివంటే?
డాక్టర్ చందన్ బల్లాల్, అతని ల్యాబ్ టెక్నీషియన్ మైసూరులోని ఒక ఆసుపత్రిలో
గత మూడేళ్లలో దాదాపు 900 అక్రమ అబార్షన్లు చేసిన డాక్టర్, ల్యాబ్ టెక్నీషియన్‌ను బెంగళూరు పోలీసులు అరెస్టు చేశారు. డాక్టర్ చందన్ బల్లాల్, అతని ల్యాబ్ టెక్నీషియన్ మైసూరులోని ఒక ఆసుపత్రిలో ఈ అబార్షన్లు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా చేసిన ప్రతి అబార్షన్‌కు సుమారు రూ. 30,000 వసూలు చేశారు. వారిద్దరి గురించి ఫిర్యాదు అందడంతో అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఆసుపత్రి మేనేజర్ మీనా, రిసెప్షనిస్ట్ రిజ్మా ఖాన్‌లను ఇప్పటికే అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.
మైసూరు సమీపంలోని మాండ్య జిల్లా కేంద్రమైన పట్టణంలో ఇద్దరు నిందితులు శివలింగే గౌడ, నయన్ కుమార్‌లను పోలీసులు అరెస్టు చేశారు. లింగ నిర్ధారణ, భ్రూణహత్య రాకెట్‌ను ఛేదించారు. గర్భిణీ స్త్రీని కారులో అబార్షన్ కోసం తీసుకెళ్తున్న సమయంలో ఈ అరెస్టులు జరిగాయి. విచారణలో నిందితులు మాండ్యలో అల్ట్రాసౌండ్ స్కాన్ సెంటర్ ను బెల్లం తయారు చేసే ఫ్యాక్టరీలో ఉంచారని తెలిపారు. అక్కడకు వెళ్లిన పోలీసు బృందం స్కాన్ మిషన్‌ను స్వాధీనం చేసుకుంది. అనుమతులు, సరైన పత్రాలు లేవని సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. వైద్యుడు అతని సహచరులతో కలిసి మైసూరు ఆసుపత్రిలో సుమారు 900 అక్రమ అబార్షన్లు నిర్వహించినట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైంది. ప్రతి అబార్షన్‌కు సుమారు రూ. 30,000 వసూలు చేశారు. ఆడపిల్లలు వద్దనుకున్న చాలా మంది అబార్షన్స్ చేయించుకున్నారు. ఈ రాకెట్‌తో సంబంధం ఉన్న ఇతర నిందితులను పట్టుకునేందుకు తదుపరి విచారణ కొనసాగుతోంది.
Next Story