Mon Dec 23 2024 19:14:04 GMT+0000 (Coordinated Universal Time)
ఇలా ఉన్నారేంట్రా.. ప్రియుడి గొంతుకోసి రక్తం తాగేశాడు
వివరాల్లోకి వెళ్తే.. చిక్ బళ్లాపూర్ లోని బట్లహళ్లిలో విజయ్- మాల దంపతులు నివాసం ఉంటున్నారు. చేలూర్ తాలూకాలోని మోడెంపల్లి..
ఈ రోజుల్లో శారీరక సంబంధాలు హత్యలకు, దారుణాలకు దారితీస్తున్నాయి. పెళ్లైన వారు, కాని వారు కూడా శారీరక సంబంధాలు పెట్టుకుంటున్నారు. ఫలితంగా ఎవరో ఒకరు ఈ అక్రమ సంబంధాలకు బలవుతున్నారు. కుటుంబాలు విచ్ఛిన్నమవుతున్నాయి. ఓ వ్యక్తి.. తన భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్న వ్యక్తి గొంతుకోసి రక్తం తాగడమే కాకుండా.. ఈ తతంగాన్నంతా వీడియో తీశాడు. ఒళ్లు గగుర్పాటుకు గురిచేసే ఈ దారుణ ఘటన కర్ణాటక రాష్ట్రంలో చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. చిక్ బళ్లాపూర్ లోని బట్లహళ్లిలో విజయ్- మాల దంపతులు నివాసం ఉంటున్నారు. చేలూర్ తాలూకాలోని మోడెంపల్లికి చెందిన మారేష్ కు మాలతో అక్రమ సంబంధం ఏర్పడిందని, విజయ్ ఇంట్లో లేనప్పుడు పలుమార్లు వారిద్దరూ కలుసుకోవడాన్ని చూసినట్లు స్థానికులు తెలిపారు. ఈ విషయమై ఊరిలో పెద్ద చర్చే జరుగుతోంది. నలుగురూ భార్య గురించి మాట్లాడే మాటల్ని వినలేని విజయ్.. కోపంతో రగిలిపోయాడు. భార్యను వదులుకోలేక.. మారేష్ ను అడ్డు తొలగించాలని భావించాడు. ఒకసారి మాట్లాడాలి రమ్మని పిలిచి మారేష్ ను సిద్దేపల్లి క్రాస్ సమీపంలోకి తీసుకెళ్లాడు.
మారేష్ పై విజయ్ దాడి చేసి.. అతను గొంతుకోసి రక్తం తాగాడు. ఇదంతా మొబైల్ ఫోన్ లో వీడియో రికార్డు చేశారు. అనంతరం మారేష్ ను వదిలి పరారయ్యాడు. తీవ్రంగా గాయపడి, రక్తపు మడుగులో ఉన్న మారేష్ ను కొందరు గుర్తించి ఆసుపత్రిలో చేర్పించగా.. వైద్యులు చికిత్స చేశారు. ప్రస్తుతం అతడి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. విజయ్, మాల ను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు.
Next Story