Tue Mar 25 2025 07:36:05 GMT+0000 (Coordinated Universal Time)
కోడికూర కోసం గొడవ.. కొడుకుని కర్రతో కొట్టిచంపిన తండ్రి
ఫలితంగా కన్నబిడ్డలను, తోడబుట్టినవారిని, కట్టుకున్న వారిని కోల్పోయి.. నిందితులుగా జైలు జీవితం గడపాల్సిన పరిస్థితి..

రోజురోజుకీ మానవ సంబంధాలు క్షీణించిపోతున్నాయి. చిన్న చిన్న కారణాలకే ప్రాణాలు తీసేంతవరకూ వెళ్తున్నారు. ఫలితంగా కన్నబిడ్డలను, తోడబుట్టినవారిని, కట్టుకున్న వారిని కోల్పోయి.. నిందితులుగా జైలు జీవితం గడపాల్సిన పరిస్థితి వస్తోంది. తాజాగా కర్ణాటకలో ఓ తండ్రి.. ఇంట్లో వండిన కోడి కూరను కొడుకు రుచిచూడలేదన్న కోపంతో.. ఓ కర్రతో అతడిని కొట్టి చంపాడు. దక్షిణ కన్నడ జిల్లాలో ఈ దారుణ ఘటన వెలుగుచూసింది. మంగళవారం ఈ ఘటన జరిగినట్లు పోలీసులు వెల్లడించారు.
సుల్లియా తాలూకా గుత్తినగర్ లోని ఓ ఇంట్లో.. షీన్ అనే వ్యక్తి భార్య, ఇద్దరు పిల్లలతో ఉంటున్నాడు. మంగళవారం కోడికూర వండగా.. ఇంటికి వచ్చిన కొడుకు శివరామ్ రుచి చూడలేదు. దాంతో ఇద్దరి మధ్య మాటల యుద్ధం జరిగింది. ఆ మాత్రానికే కోపోద్రిక్తుడైన తండ్రి చెక్కతో బలంగా కొట్టడంతో.. 32 ఏళ్ల కొడుకు మరణించాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.
Next Story