కీచక పాస్టర్.. విద్యార్థినిపై లైంగిక దాడి
కర్ణాటకలో మరో కీచక పాస్టర్ బాగోతం వెలుగు చూసింది. శివమొగ్గ నగరంలోని చర్చికి అనుబంధంగా ఉన్న ప్రీ యూనివర్శిటీ కళాశాలలో
కర్ణాటకలో మరో కీచక పాస్టర్ బాగోతం వెలుగు చూసింది. శివమొగ్గ నగరంలోని చర్చికి అనుబంధంగా ఉన్న ప్రీ యూనివర్శిటీ కళాశాలలో చదువుతున్న మైనర్ బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడన్న ఆరోపణలపై 49 ఏళ్ల పాస్టర్‌ను అరెస్టు చేసినట్లు పోలీసులు శుక్రవారం తెలిపారు. అతడిపై పోక్సో చట్టంలోని సెక్షన్ 3 (లైంగిక నేరాల నుంచి పిల్లల రక్షణ చట్టం, 2012), ఎస్సీ & ఎస్టీ (అత్యాచారాల నిరోధక) చట్టం, 2016లోని సెక్షన్ 8, 12 కింద ఫోర్ట్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయబడిందని శివమొగ్గ జిల్లా డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ బాలరాజు తెలిపారు. కాలేజ్ ప్రిన్సిపాల్‌గా ఉన్న పాస్టర్ ప్రస్తుతం జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నట్లు బాలరాజు తెలిపారు.
ఫ్రాన్సిస్ ఫెర్నాండెజ్ అరెస్టయిన పాస్టర్. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జీవశాస్త్రం బోధిస్తున్న ఫ్రాన్సిస్ తనను లైంగికంగా వేధిస్తున్నాడని పీయూసీ విద్యార్థిని ఆరోపించింది. విద్యార్థిని ఎస్సీఎస్టీ హాస్టల్లో చదువుతోంది. ఫెర్నాండెజ్ వేధింపులతో మనస్థాపం చెందని విద్యార్థిని నిన్న(జూన్ 20) సాయంత్రం ఆత్మహత్యకు యత్నించింది. విద్యార్థిని వెంటనే ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆ తర్వాత విద్యార్థిని ఫిర్యాదు మేరకు పాస్టర్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత పాస్టర్ ఫ్రాన్సిస్‌కు వైద్య పరీక్షలు చేయించి కోర్టు ముందు హాజరుపరచగా, అతనికి 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీ విధించింది.
ఈ ఘటనపై బంజారా సంఘాలు నిరసన వ్యక్తం చేశాయి. గురువారం శివమొగ్గ పోలీస్‌స్టేషన్ ఎదుట పూజారిపై కొందరు సంఘం సభ్యులు ఆందోళనకు దిగారు. మైనర్ బాలికకు న్యాయం చేయాలని, పాస్టర్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు. బంజారా యూత్ ఫోరంకు చెందిన గిరీష్ మాట్లాడుతూ.. ''శివమొగ్గలోని ఓ ప్రతిష్టాత్మక క్రైస్తవ కళాశాల ప్రిన్సిపాల్‌గా ఉన్న చర్చి పాస్టర్ మా బంజారా బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఆమె మైనర్. నిందితులను శివమొగ్గ ఫోర్ట్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయనపై పలు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయినా కాలేజీ యాజమాన్యం అతనిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు.'' అని తెలిపారు.