Fri Nov 22 2024 22:50:31 GMT+0000 (Coordinated Universal Time)
దారుణం.. కాశ్మీరీ పండిట్ ను కాల్చిచంపిన ఉగ్రవాదులు
తీవ్రవాదుల దుశ్చర్యతో ఆ ప్రాంతం ఉలిక్కిపడింది. ప్రస్తుతం చోటిపొరా ప్రాంతాన్ని సైన్యం అదుపులోకి తీసుకుంది. ఈ ఘటనపై ..
జమ్ము-కశ్మీర్ లో ఉగ్రవాదులు మరోసారి దుశ్చర్యకు పాల్పడ్డారు. రెండ్రోజుల వ్యవధిలో మరోసారి కశ్మీరీ పండిట్లపై దాడి జరిగింది. కశ్మీరీ పండిట్లు లక్ష్యంగా జరిగిన ఈ దాడిలో ఒక కశ్మీరీ పండిట్ మృతి చెందగా.. అతని సోదరుడు తీవ్రంగా గాయపడ్డాడు. స్థానిక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఈ ఘటన మంగళవారం షోపియాన్ జిల్లా యాపిల్ ఆర్కిడ్ ప్రాంతంలోని చోటిపొరాలో జరిగింది. కశ్మీరీ పండిట్లు ఎక్కువగా ఉన్న ప్రాంతం లక్ష్యంగా తీవ్రవాదులు దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో సునీల్ కుమార్ అనే పండిట్ మృతి చెందగా.. సోదరుడు పింటూ కుమార్ గాయపడ్డాడు. పోలీసులు పింటూను స్థానిక ఆస్పత్రికి తరలించారు.
బీజేపీపై అసదుద్దీన్ ఫైర్
తీవ్రవాదుల దుశ్చర్యతో ఆ ప్రాంతం ఉలిక్కిపడింది. ప్రస్తుతం చోటిపొరా ప్రాంతాన్ని సైన్యం అదుపులోకి తీసుకుంది. ఈ ఘటనపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ స్పందించారు. బీజేపీపై ఆయన తీవ్ర విమర్శలు గుప్పించారు. ప్రధాని మోదీ జమ్ము-కశ్మీర్ లో నియమించిన లెఫ్టినెంట్ గవర్నర్, పాలకవర్గం విఫలమైందని, అక్కడి ప్రభుత్వం కశ్మీరీ పండిట్లకు రక్షణ కల్పించలేకపోతోందని విమర్శించారు. ఆర్టికల్ 370ని రద్దు చేస్తే పండిట్లంతా సురక్షితంగా ఉంటారని చెప్పారు కానీ.. పరిస్థితి చూస్తే అలా కనిపించడం లేదన్నారు. తాజాగా జరిగిన ఈ ఘటనపై ప్రధాని మోదీ, హోంమంత్రి, బీజేపీ అధిష్టానం సమాధానం చెప్పాలని అసదుద్దీన్ డిమాండ్ చేశారు.
Next Story