Mon Dec 23 2024 06:33:47 GMT+0000 (Coordinated Universal Time)
కేరళకు వచ్చిన అమెరికా మహిళకు మద్యం ఇచ్చి
మహిళకు మద్యం ఇచ్చిన నిందితులు.. ఆమె మత్తులోకి జారుకున్నాక
కేరళ రాష్ట్రంలో అమెరికా మహిళపై అత్యాచారం జరిగింది. ఇద్దరు వ్యక్తులు ఈ దారుణానికి పాల్పడ్డారు. మహిళకు మద్యం ఇచ్చిన నిందితులు.. ఆమె మత్తులోకి జారుకున్నాక తమతో పాటూ బైక్‌పై మరో చోటుకి తీసుకెళ్లి అత్యాచారానికి ఒడిగట్టారు. మహిళ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు బుధవారం నిందితులను అరెస్ట్ చేశారు.
ఆమె జులై 22న ఇండియాకు వచ్చింది. కేరళలోని కొల్లమ్ జిల్లాలోని ఓ ఆశ్రమంలో ఉంటోంది. జులై 31న ఆమె తన ఆశ్రమానికి సమీపంలోని ఓ బీచ్‌లో ఒంటరిగా ఉన్న సమయంలో ఇద్దరు వ్యక్తులు ఆమెకు మద్యం ఇచ్చారు. మద్యం మత్తులో ఉన్న ఆమెను బైక్‌పై మరో ప్రాంతానికి తీసుకెళ్లి పలుమార్లు అత్యాచారానికి ఒడిగట్టారు. మరుసటి రోజు బాధితురాలు కరునగపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు జయన్ (39), నిఖిల్ (27) అదుపులోకి తీసుకున్నారు. వారిపై సెక్షన్ 376డి, 376(2)(ఎన్) కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. మహిళతో బీచ్ లో స్నేహం చేసిన జయన్, నిఖిల్ ఆమెకు మద్యం ఇచ్చి ఇంటికి తీసుకెళ్లారని.. మహిళ అపస్మారక స్థితిలోకి వెళ్లిన తర్వాత ఇద్దరు వ్యక్తులు ఆమెపై లైంగిక దాడి చేశారని పోలీసులు తెలిపారు. జయన్, నిఖిల్‌లను బుధవారం కోర్టులో హాజరుపరిచారు.
Next Story