Sun Dec 22 2024 21:15:15 GMT+0000 (Coordinated Universal Time)
మహిళా పోలీసుకే 300 సార్లు కాల్ చేశాడు
ఆమె అధికారిక నెంబర్ కు ఏకంగా 300 సార్లు కాల్స్ చేశాడు. పదే
మహిళలకు మొబైల్ ఫోన్లలో వేధింపులు ఎదురవుతూ ఉంటాయి. అలాంటి సమయాల్లో పోలీసులను ఆశ్రయిస్తే.. వేధిస్తున్న వాళ్లను పట్టుకుని జైల్లో పెడతారు. అయితే ఓ ఆకతాయి ఏకంగా మహిళా పోలీసునే వేధించాడు. ఏకంగా 300 సార్లు ఆమెకు కాల్స్ చేసి ఇబ్బందులకు గురి చేశాడు. 300 సార్లు మహిళా పోలీసు అధికారిక నెంబర్ కే కాల్స్ చేసి వేధించాడు. కేరళలో ఈ ఘటన చోటు చేసుకుంది.
కొచ్చిన్ పోలీసు స్టేషన్ లో పని చేస్తున్న మహిళా పోలీసుకు కొన్ని రోజుల నుంచి ఓ ఆకతాయి ఫోన్ చేస్తున్నాడు. ఆమె అధికారిక నెంబర్ కు ఏకంగా 300 సార్లు కాల్స్ చేశాడు. పదే పదే కాల్స్ చేసి విసిగించడంతో ఆమె విసిగిపోయి ఆకతాయికి తగిన బుద్ధి చెప్పాలని నిర్ణయించుకుంది. ఎప్పుడూ వాడిని తిడుతూ ఫోన్ కట్ చేసే ఆమె ఒక్క సారిగా అతడితో మంచిగా మాట్లాడటం మొదలుపెట్టింది. అతడు ఉండే ప్రదేశం తెలుసుకొని, అక్కడికి వెళ్లి అదుపులోకి తీసుకుంది. మంగళవారం నాడు ఎర్నాకులం కోర్టులో ఆ ఆకతాయిని ప్రవేశపెట్టింది. తనపై జరిగిన వేధింపులను ఆమె సాక్షాధారాలతో సహా కోర్టులో నిరూపించింది. కోర్టు అతడిపై ఆగ్రహం వ్యక్తం చేసి మూడు సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధించింది. రూ.15 వేల ఫైన్ వేసింది.
Next Story