Mon Dec 23 2024 18:05:50 GMT+0000 (Coordinated Universal Time)
రేప్ కేసులో యంగ్ డైరెక్టర్ అరెస్ట్
కాకనాడ్ ఇన్ఫోపార్క్ స్టేషన్లో యువతి ఫిర్యాదు మేరకు.. పోలీసులు కేసు నమోదు చేశారు. కొచ్చిలో టాటూ ఆర్టిస్ట్ పై వరుస లైంగిక..
కేరళ : సినీ పరిశ్రమలో లైంగిక వేధింపులు షరా మామూలు అయిపోయాయి. తరచుగా లైంగిక వేధింపుల వివాదాలు తెరపైకి వస్తూనే ఉన్నాయి. తాజాగా మళయాళ చిత్ర పరిశ్రమలో లైంగిక వేధింపుల వివాదం తెరపైకి వచ్చింది. ఇంకా ఫస్ట్ సినిమా కూడా విడుదల కాకుండానే లైంగిక వేధింపుల కేసులో కొత్త డైరెక్టర్ అరెస్ట్ అయ్యాడు. దర్శకుడు లిజు కృష్ణ.. పడవెట్టు అనే సినిమాతో మలయాళ ఇండస్ట్రీకి పరిచయం కావాల్సి ఉంది. ఇంతలోనే అతనిపై ఓ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది.
కాకనాడ్ ఇన్ఫోపార్క్ స్టేషన్లో యువతి ఫిర్యాదు మేరకు.. పోలీసులు కేసు నమోదు చేశారు. కొచ్చిలో టాటూ ఆర్టిస్ట్ పై వరుస లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చిన వెంటనే.. లిజు కృష్ణ కేసు తెరపైకి రావడం మాలీవుడ్ లో సంచలనం రేపింది. లిజుకృష్ణపై లైంగిక ఆరోపణలు చేస్తూ యువతి ఫిర్యాదు చేయడం కలకలం రేపింది. ఈ విషయంపై ఓ పోలీసు అధికారి మాట్లాడుతూ.. లిజుకృష్ణను ఐపీసీ సెక్షన్ 376కింద అరెస్ట్ చేసినట్లు తెలిపారు. సదరు యువతికి సంబంధించిన వివరాలను గోప్యంగా ఉంచినట్లు చెప్పారు.
Next Story