Mon Dec 15 2025 00:25:31 GMT+0000 (Coordinated Universal Time)
సెక్స్ రాకెట్ గుట్టురట్టు.. మహిళ ఫిర్యాదుతో ఏడుగురు అరెస్ట్
తమ జీవిత భాగస్వాములను బలవంతంగా ఒప్పించి మరీ.. ఇతరులకు అప్పగించేస్తున్నారు. ఇది నచ్చని ఓ మహిళ తన భర్తకు

పాశ్చాత్య పోకడలు పెరిగిపోతున్నాయి. జీవిత భాగస్వాములను కాదని.. ఇతరులతో లైంగిక సుఖాలకు అలవాడుపడే భావజాలం క్రమంగా విస్తరిస్తోంది. అంతేకాక.. తమ జీవిత భాగస్వాములను బలవంతంగా ఒప్పించి మరీ.. ఇతరులకు అప్పగించేస్తున్నారు. ఇది నచ్చని ఓ మహిళ తన భర్తకు ఎదురు తిరిగింది. బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సెక్స్ రాకెట్ గుట్టు రట్టయింది. ఏడుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళితే..
Also Read : నేటి నుంచి స్కూళ్లకు సెలవులు !
తన భర్త.. మరో పురుషుడితో లైంగిక సంబంధానికి బలవంతం చేస్తున్నాడంటూ.. ఓ బాధితురాలు కేరళలోని కురుకచల్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. గతంలో కయంకులమ్ లో ఈ తరహా కేసులు వెలుగు చూశాయి. టెలిగ్రామ్, ఇతర సోషల్ నెట్ వర్కింగ్ సైట్ల సహాయంతో ఒక గ్రూపు కేరళ వ్యాప్తంగా ఈ తరహా కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. టెలిగ్రామ్ లో గ్రూపులు ఏర్పాటు చేసి, వాటి ద్వారా సభ్యులను అనుసంధానం చేస్తూ.. సెక్స్ రాకెట్ నడుపుతున్నట్లు పోలీసులు తెలిపారు. బాదితురాలి ఫిర్యాదుతో ఆమె భర్తను అరెస్ట్ చేశామని, దీనివెనుక పెద్ద ముఠానే ఉందని చంగన్ చెర్రి డీఎస్పీ ఆర్. శ్రీకుమార్ వెల్లడించారు. ఈ భాగస్వాముల మార్పిడి ముఠాలో సుమారు 1000 మంది వరకూ ఉన్నట్లు పోలీసులు చెప్తున్నారు.
News Summary - Kerala Police arrest 7 for allegedly exchanging partners for sex
Next Story

