Mon Dec 23 2024 14:50:54 GMT+0000 (Coordinated Universal Time)
సంచలనం రేపిన భార్యల మార్పిడి కేసు.. ఫిర్యాదు చేసిన మహిళ హత్య
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కేరళలో కపుల్ మీట్స్ కేరళ అనే టెలిగ్రామ్ గ్రూప్ ద్వారా భార్యల మార్పిడి జరుగుతోంది.
కేరళలో భార్యల మార్పిడి కేసు ఎంత సంచలనం సృష్టించిందే అప్పుడే మరచిపోలేం. ఈ ఉదంతంపై ఫిర్యాదు చేసిన మహిళ తాజాగా హత్యకు గురైంది. 26 ఏళ్ల మహిళను ఆమె భర్తే హత్య చేసి.. ఆపై తాను విషం తీసుకుని ఆత్మహత్యాయత్నం చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం నిందితుడైన షినో మాథ్యూ కొట్టాయం మెడికల్ కాలేజీలో చికిత్స పొందుతున్నాడు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కేరళలో కపుల్ మీట్స్ కేరళ అనే టెలిగ్రామ్ గ్రూప్ ద్వారా భార్యల మార్పిడి జరుగుతోంది. ఆ గ్రూపులో ఉన్న 9 మందికి పైగా సభ్యులు తమ భార్యలను మార్చుకున్నారు. ఈ క్రమంలో షినో మాథ్యూ కూడా తన భార్యను బలవంతంగా వారివద్దకు పంపగా.. వారంతా ఆమెపై బలాత్కారం చేశారు. ఈ ఘటనపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో..9 మందిని పోలీసులు ఈ ఏడాది జనవరిలో అరెస్ట్ చేశారు.
ఆ ముఠా వెనుక పెద్దహస్తాలు ఉండి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. తాజాగా ఈ కేసులో బాధితురాలైన షినో భార్య హత్యకు గురికావడం మరో సంచలనమైంది. తన ఇంటిముందు రక్తపు మడుగులో పడిఉన్న మహిళను చూసిన ఇరుగుపొరుగువారు వెంటనే మెడికల్ కాలేజీకి తరలించగా.. చికిత్స పొందుతూ మరణించింది. బాధితురాలి తండ్రి.. ఆమె భర్తే ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటాడని ఆరోపించారు.
Next Story