Mon Dec 23 2024 09:37:19 GMT+0000 (Coordinated Universal Time)
ఢిల్లీ లిక్కర్ స్కాంలో మరో అరెస్ట్
ఢిల్లీ లిక్కర్ స్కాంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. వ్యాపార వేత్త అమిత్ అరోరాను ఈడీ అరెస్ట్ చేసింది.
ఢిల్లీ లిక్కర్ స్కాంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ స్కాంలో మద్యం వ్యాపార వేత్త అమిత్ అరోరాను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అరెస్ట్ చేసింది. అమిత్ అరోరా ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాకు ముఖ్య అనుచరుడిగా గుర్తించారు. అర్ధరాత్రి అమిత్ అరోరాను ఈడీ అధికారులు పోలీసులు అరెస్ట్ చేశారు.
మనీష్ సిసోడియాకు...
ఢిల్లీ లిక్కర్ స్కాం లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ స్పీడ్ పెంచింది. ఇప్పటికి ఈ స్కాంలో ఆరుగురిని అరెస్ట్ చేసినట్లయింది. ఈ కేసులో మరికొందరిని కూడా అరెస్ట్ చేసేందుకు సిద్దమవుతున్నట్లు తెలిసింది. లిక్కర్ స్కాంలో ఇప్పటికే సీబీఐ ఛార్జిషీట్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. తర్వాత ఎవరిని అధికారులు ఈ స్కాంలో అరెస్ట్ చేస్తారన్నది ఆసక్తికరంగా మారింది.
Next Story