Fri Dec 20 2024 18:44:48 GMT+0000 (Coordinated Universal Time)
ఖమ్మంలో ప్రభుత్వ టీచర్ దారుణ హత్య.. షాకింగ్ విషయాలు
పాఠశాలకు వెళ్తుండగా.. ఉపాధ్యాయుడి బైకును కారుతో ఢీ కొట్టారు.. కిందపడిపోయిన
ఖమ్మం జిల్లాలో ప్రభుత్వ ఉపాధ్యాయుడిని దారుణంగా హత్య చేశారు. పాఠశాలకు వెళ్తుండగా.. ఉపాధ్యాయుడి బైకును కారుతో ఢీ కొట్టారు.. కిందపడిపోయిన తరువాత టీచర్ ని గొడ్డలితో నరికి అత్యంత కిరాతకండా హతమార్చారు. పోసులు, స్థానికుల సమాచారం ప్రకారం ఖమ్మం జిల్లా కూసుమండి మండలం నాయకన్ గూడెంకు చెందిన మారోజు వెంకటాచారి(49) ప్రభుత్వ ఉపాధ్యాయుడు. సూర్యాపేట జిల్లా నడిగూడెం మండలం సిరిపురం ప్రభుత్వ పాఠశాలలో ఇతడు పీఈటీగా విధులు నిర్వహిస్తున్నాడు. ఎప్పటిలాగే తన స్వగ్రామం నుంచి పాఠశాలకు బయలుదేరిన సమయంలో ఈ దారుణ హత్య చోటు చేసుకుంది.
వెంకటాచారి కోసం నాయకన్ గూడెం శివారులో ముందుగానే కాపు కాసారు దుండగులు. బైక్ లో అతడు ఊరి బయటకు రాగానే దుండగులు కారును వెంకటాచారి బైక్ పైకి వేగంగా పోనిచ్చి ఢీకొట్టారు. అతడు కింద పడగానే మెడపై గొడ్డలితో నరికాడు. అతడు అక్కడికక్కడే మృతిచెందగా దుండగులు అక్కడి నుండి పరారయ్యారు. స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఏరియా హాస్పిటల్ కు తరలించారు. టీచర్ ను చంపిన దుండుగుల ఎరుపు రంగు కారులో వచ్చినట్లు ప్రత్యక్ష సాక్షులు పోలీసులకు తెలిపారు. ఆ మార్గంలోని సిసి కెమెరాలను పరిశీలించగా ఓ ఎరుపు కారు, దాని వెనకాలే బైక్ వెళుతుండగా పోలీసులు గుర్తించారు.
Next Story