Mon Dec 23 2024 06:03:20 GMT+0000 (Coordinated Universal Time)
కిడ్నాప్ కు గురైన భారత కుటుంబం దారుణ హత్య
హత్య కాబడిన కుటుంబంలో 8 నెలల చిన్నారి కూడా ఉండటం తీవ్రంగా కలచివేస్తోంది. ఆ దుర్మార్గుడు ఎంత కటికుడైతే ఇంతటి దారుణానికి..
కాలిఫోర్నాయాలో దారుణ ఘటన వెలుగు చూసింది. ఇటీవల భారత్ కు చెందిన నలుగురు సభ్యుల భారతీయ కుటుంబం కిడ్నాప్ గురైంది. ఆ కుటుంబం మొత్తం హత్యకు చేయబడినట్లు కాలిఫోర్నియా అధికారులు ఈ ప్రకటన చేశారు. హత్య కాబడిన కుటుంబంలో 8 నెలల చిన్నారి కూడా ఉండటం తీవ్రంగా కలచివేస్తోంది. ఆ దుర్మార్గుడు ఎంత కటికుడైతే ఇంతటి దారుణానికి పాల్పడి ఉంటాడో. ఇది భయంకరమైనది, అర్థం లేనిదంటూ మెర్సెడ్ కంట్రీ శాంతి భద్రతల చీఫ్ వెర్న్ వార్న్ కే వ్యాఖ్యానించారు. జస్ దీప్ సింగ్ (36), జస్లీన్ కౌర్ (27), వారి ఎనిమిది నెలల చిన్నారి అరూహి దేరి, వారి సమీప బంధువు అమన్ దీప్ సింగ్ (39) ఇండియానా రోడ్డు, హచిసన్ రోడ్డు సమీపంలో నిర్జీవంగా కనిపించినట్టు తెలిపారు.
అటుగా వెళ్తున్న వ్యవసాయ కార్మికుడు వారి మృతదేహాలను చూసి అధికారులకు సమాచారం ఇచ్చినట్లు వార్న్ కే వెల్లడించారు. ఈ ఘటన చూసి తనకు వచ్చిన కోపాన్ని వర్ణించలేనని పోలీసు అధికారి వ్యాఖ్యానించడం గమనార్హం. జీసస్ మాన్యుయేల్ సల్గాడో అనే వ్యక్తి ఈ హత్యలకు పాల్పడినట్టు వార్న్ కే ప్రకటించారు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకోగా.. ఆత్మహత్యాప్రయత్నం చేశాడు. అతని పరిస్థితి విషమించడంతో ఆస్పత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. కాగా.. జస్ దీప్ సింగ్ ఇటీవలే ట్రక్ రెంటింగ్ కంపెనీ ప్రారంభించగా.. అక్కడి నుంచే వారందరినీ కిడ్నాప్ చేసినట్లు అక్కడున్న సీసీటీవీలో రికార్డయ్యాయి.
Next Story