Sun Dec 22 2024 22:24:45 GMT+0000 (Coordinated Universal Time)
కోల్కతా ప్రభుత్వ ఆసుపత్రిలో మరో దారుణం
ఆసుపత్రిలో వార్డ్ బాయ్గా పనిచేస్తున్న తనయ్ పాల్
కోల్కతాలోని ప్రభుత్వ ఆసుపత్రిలో 26 ఏళ్ల మహిళ తన బిడ్డ పక్కన నిద్రిస్తున్నప్పుడు లైంగిక వేధింపులు ఎదురయ్యాయి. ఓ ఆరోగ్య కార్యకర్త ఆమెపై వేధింపులకు పాల్పడ్డాడు. తన బిడ్డకు చికిత్స అందించడం కోసం ఆసుపత్రికి రాగా ఆ మహిళ ఇలాంటి దారుణాన్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. కోల్కతాలోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ చైల్డ్ హెల్త్ (ఐసిహెచ్)లోని పిల్లల వార్డులో ఆమె నిద్రిస్తున్నప్పుడు ఈ సంఘటన జరిగింది.
ఆసుపత్రిలో వార్డ్ బాయ్గా పనిచేస్తున్న తనయ్ పాల్ (26) అనే వ్యక్తి ఈ పని చేశాడు. పిల్లల వార్డులోకి ప్రవేశించి, మహిళను అనుచితంగా తాకడమే కాకుండా, మహిళ బట్టలను కూడా విప్పించాడు. ఈ ఘటనను నిందితుడు తన మొబైల్ ఫోన్లో రికార్డు కూడా చేశాడని బాధితురాలు తెలిపింది. ఈ ఘటనపై ఫిర్యాదు అందుకున్న కోల్కతా పోలీసులు భారతీయ న్యాయ సంహిత (బిఎన్ఎస్)లోని సంబంధిత సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసి నిందితుడిని అరెస్టు చేశారు. పోలీసులు తనయ్ పాల్ మొబైల్ ఫోన్ను స్వాధీనం చేసుకుని ఫోరెన్సిక్ పరీక్షకు పంపారు.

Next Story