Fri Nov 22 2024 18:49:16 GMT+0000 (Coordinated Universal Time)
ప్రైవేట్ క్లాస్ పేరుతో విద్యార్థినిపై టీచర్ లైంగిక దాడి
విద్యార్థినిపై లైంగిక దాడి చేసిన సమయంలో..మొబైల్ లో వీడియో తీశాడు. అనంతరం విద్యార్థిని ఇంటికెళిపోయింది. 2022 ఫిబ్రవరిలో..
కోల్ కతా : పాఠాలు చెప్తూ.. విద్యార్థుల భవిష్యత్ కు బంగారు బాట వేయాల్సిన ఉపాధ్యాయుడే కీచక అవతారమెత్తాడు. ప్రైవేట్ క్లాస్ పేరుతో విద్యార్థినిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన కోల్ కతాలో జరిగింది. హౌరాకు చెందిన విద్యార్థినిపై అత్యాచారానికి పాల్పడిన ఆ కీచక ఉపాధ్యాయుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళ్తే.. ప్రియేష్ సింగ్ అనే ఉపాధ్యాయుడు సెంగార్ ఇనిస్టిట్యూట్ లో జాగ్రఫీ బోధించేవాడు. గత డిసెంబర్ లో ప్రైవేట్ క్లాస్ తీసుకునే వంకతో బాధిత విద్యార్థినిని సాల్ట్ లేక్ గెస్ట్ హౌస్ కు పిలిపించాడు. మాయమాటలు చెప్పి విద్యార్థినిని లోబరుచుకుని, ఆపై లైంగిక దాడికి పాల్పడ్డాడు.
విద్యార్థినిపై లైంగిక దాడి చేసిన సమయంలో..మొబైల్ లో వీడియో తీశాడు. అనంతరం విద్యార్థిని ఇంటికెళిపోయింది. 2022 ఫిబ్రవరిలో మరోసారి తనను కలిసేందుకు గ్వాలియర్ రావాలని కోరగా.. విద్యార్థిని తిరస్కరించింది. దాంతో అతను విద్యార్థినిని బెదిరించసాగాడు. సాల్ట్ లేక్ గెస్ట్ హౌస్లో తీసిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానని లేదంటే తనకు రూ.5 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. ఉపాధ్యాయుడి వేధింపులు భరించలేక.. బాధిత విద్యార్థిని ఫిబ్రవరి 15న కోల్ కతా పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని యూపీఎస్సీ ఉపాధ్యాయుడిని మధ్యప్రదేశ్ లో అదుపులోకి తీసుకున్నారు. శుక్రవారం కోల్ కతాలోని సాల్ట్ లేక్ కోర్టులో హాజరు పరిచి రిమాండ్ కు తరలించారు.
Next Story