Sun Dec 22 2024 21:45:20 GMT+0000 (Coordinated Universal Time)
పక్కింటి మహిళ.. పట్టించేసింది
కోల్కతాలో ఓ మహిళ తన బిడ్డను మరో మహిళకు విక్రయించిన కేసులో
కోల్కతాలో ఓ మహిళ తన బిడ్డను మరో మహిళకు విక్రయించిన కేసులో అరెస్టు చేశారు. తల్లి రూపాలి మోండల్ తన బిడ్డను ఓ మహిళకు రూ.4 లక్షలకు విక్రయించినట్లు పోలీసులు గుర్తించారు. కోల్కతాలోని నోనాదంగాలోని రైల్ కాలనీకి చెందిన రూపాలి నెల కూడా నిండని ఆడ బిడ్డకు బదులుగా డబ్బులు తీసుకున్నట్లు ఆనందపూర్ పోలీస్ స్టేషన్లో అధికారులకు సమాచారం రావడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
పోలీసులు బిడ్డ గురించి ఆమెను ప్రశ్నించగా.. అధికారులకు ఆమె సరైన సమాధానాలు చెప్పలేకపోయింది. దీంతో సోమవారం ఉదయం మహిళను అరెస్టు చేశారు. విచారణలో ఆమె నేరాన్ని అంగీకరించింది. ఈ ఘటనకు సంబంధించి రూపా దాస్, స్వప్న సర్దార్ అనే మరో ఇద్దరిని అరెస్టు చేశారు. రూపాలి ఇంటి దగ్గరే ఉన్న ప్రతిమ భున్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. నిందితులపై జువైనల్ జస్టిస్ (పిల్లల సంరక్షణ & రక్షణ) సంబంధిత సెక్షన్లతో పాటు పలు ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
నిందితులిద్దరినీ విచారించిన తర్వాత, వారు మిడ్నాపూర్కు చెందిన కళ్యాణి గుహకు సంబంధించిన సమాచారాన్ని ఇచ్చారు. పర్నర్శ్రీ పోలీస్స్టేషన్ అధికారులు కళ్యాణి గుహను అరెస్టు చేసి, ఆమె గదిలో నుంచి శిశువును రక్షించారు. కళ్యాణికి సంతానం లేదని, పెళ్లయి 15 ఏళ్లు అయిందని తెలిసింది. మైనర్ బాలికను సురక్షితంగా రక్షించి, బాలల సంరక్షణ విభాగానికి అప్పగించారు.
Next Story