Mon Dec 23 2024 09:23:13 GMT+0000 (Coordinated Universal Time)
కోనసీమ జిల్లాలో కాల్పులు.. ఫైనాన్షియర్పై దాడి
అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో తుపాకీ కాల్పుల కలకలం రేగింది. రావుల పాలెంలో తుపాకీ మోతలు స్థానికులకు వణుకు పుట్టించాయి
ీఅంబేడ్కర్ కోనసీమ జిల్లాలో తుపాకీ కాల్పుల కలకలం రేగింది. రావుల పాలెంలో తుపాకీ మోతలు స్థానికులకు వణుకు పుట్టించాయి. రావులపాలెంకు చెందిన ఫైనాన్షియర్ గుడిమెట్ల ఆదిత్యారెడ్డిపై గుర్తు తెలియని కొందరు నాటు బాంబులు, తుపాకితో దాడికి పాల్పడ్డారు. అయితే ఆదిత్యారెడ్డి తిరగబడటంతో గన్ మిస్ ఫైర్ అయిందని పోలీసులు తెలిపారు.
దుండగుల కోసం గాలింపు...
అయితే కాల్పుల మోతకు స్థానికులు రావడంతో దుండగులు అక్కడి నుంచి పరారయ్యారని పోలీసులు తెలిపారు. ఈ దాడిలో ఇద్దరు పాల్గొన్నారని పోలీసులు తెలిపారు. వచ్చిన ఇద్దరు దుండగులు నాటు బాంబులు ఉపయోగించారని, నాటు బాంబుల సంచీని అక్కడే వదిలేసి పారిపోయారని చెప్పారు. ఫైనాన్షియర్ ఆదిత్యా రెడ్డి వద్ద డబ్బులు తీసుకున్న వారే ఈ దాడికి పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. పారిపోయిన వారి కోసం గాలిస్తున్నారు.
Next Story